పిల్లలు రాత్రి ఒక్కటైనా, రెండైనా నిద్రపోనే పోరు. అలాగే ఇంట్లో వాళ్లను కూడా పడుకోనివ్వరు. ఏ ఒక్కరూ మెలుకువ లేకపోయినా ఒక్కటే ఏడుస్తుంటారు. అయితే మీరు కొన్ని ట్రిక్స్ ను ఫాలో అయితే మాత్రం మీ పిల్లలు మీకంటే ముందే నిద్రపోతారు.
పిల్లలకు నిద్ర చాలా అవసరం. నిద్రతోనే పిల్లలు హుషారుగా, హెల్తీగా ఉంటారు. అయితే ఏ వయసు పిల్లలు ఎంత సేపు నిద్రపోవాలో చాలా మందికి తెలియదు. ఇదే తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారుతుంది. మరి ఏ వయసు పిల్లలు ఎంత సేపు నిద్రపోవాలి? పిల్లలు త్వరగా నిద్రపోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పిల్లలకు నిద్ర ఎంత ముఖ్యం?
పొద్దున్నే లేచి ఆడుకునే పిల్లలకు నిద్రచాలా చాలా అవసరం. ఇలాంటి పిల్లల మెదడులోని నాడీ కణాలు పెరుగుతాయి. వీళ్లు రాత్రిపూట బాగా నిద్రపోతేనే ఉదయం రిఫ్రెష్ గా ఫీలవుతారు. అలాగే పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. కండరాల నష్టం కూడా నిద్రలోనే సరి అవుతుంది. శరీర పనితీరుకు, బరువును నిర్వహించడానికి పిల్లలకు రాత్రి నిద్ర చాలా అవసరం.
వయసును బట్టి ఎంతసేపు నిద్రపోవాలి?
నవజాత శిశువులు మొదటి త్రైమాసికంలో కనీసం 11 గంటల పాటైనా నిద్రపోవాలి. వీరు ఎక్కువగా 14-17 గంటలు నిద్రపోవాలని సిఫార్సు చేయబడింది. నాలుగు నెలల నుంచి ఏడాది వయసున్న పిల్లలు కనీసం పది గంటలు నిద్రపోవాలి. వీరు గరిష్ఠంగా 12-15 గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒకటి నుంచి రెండు సంవత్సరాల మధ్యున్న పిల్లలు తొమ్మిది గంటల నిద్రపోవాలి. వీళ్లు గరిష్టంగా 11-14 గంటల నిద్రపోవాలని సిఫార్సు చేయబడింది. మూడు నుంచి ఐదేళ్ల మధ్య కనీసం 8 గంటలు, గరిష్టంగా 10-13 గంటలు నిద్రపోవాలని సిఫార్సు చేయబడింది. ఆరేండ్ల వయసు దాటిన తర్వాత పిల్లలు రోజూ ఎనిమిది గంటల నిద్ర ఖచ్చితంగా నిద్రపోవాలి.
పిల్లలు వారి శరీరానికి అవసరమైనంత నిద్రపోకపోతే వారి ఎదుగుదల దెబ్బతింటుంది. నిజానికి పిల్లలు ఎక్కువగా పగటిపూట నిద్రపోతారు. కానీ దీనివల్ల వారు అలసిపోయినట్టుగా ఉంటారు. అలాగే ఏదైనా నేర్చుకోవడంతో ఇబ్బంది పడతారు. దీనివల్ల వారు రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేరు.
రాత్రిపూట పిల్లలు బాగా నిద్రపోవాలంటే ఏం చేయాలి?