ఇది కదా పేరెంటింగ్ అంటే.. వీళ్లు కదా నిజమైన పేరెంట్స్ అంటే..!

By Ramya Sridhar  |  First Published Mar 27, 2024, 3:11 PM IST

 కారు, తమ సొంత ఇంటిని అమ్మేశారు. అమ్మేసిన డబ్బుతో కొడుకును లాంగ్ లెర్నింగ్ టూర్ కి తీసుకువెళ్లారు. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించదిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల సంతోషం కోసమే ఆలోచిస్తారు. తాము ఎంత కష్టపడినా సరే.. తమ పిల్లల భవిష్యత్తు మాత్రం బంగారు మయంగా మారాలని అనుకుంటారు. అందుకోసం పిల్లలకు  చిన్నతనం నుంచే ఏవేవో నేర్పిస్తారు. ఎంతైనా ఖర్చు చేస్తారు. అయితే.. ఓ జంట మాత్రం తమ కడుకు  కోసం ఎవరూ చేయని పని చేశారు.

తమ ఏకైక కుమారుడిని సంవత్సరం పాటు ప్రపంచ యాత్రకు తీసుకువెళ్లడానికి తమకు ఉన్న కారు, తమ సొంత ఇంటిని అమ్మేశారు. అమ్మేసిన డబ్బుతో కొడుకును లాంగ్ లెర్నింగ్ టూర్ కి తీసుకువెళ్లారు. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించదిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Latest Videos

undefined

పిల్లలను ప్రతి నిమిషం చదువు, రాయి అంటూ ఒత్తిడి చేసే తల్లిదండ్రులు అన్ని చోట్లా ఉంటారు.ఎగ్జామ్‌లు దగ్గర పడుతున్న కొద్దీ, తమ పిల్లలు చదువులో ఎక్కువ సమయం వెచ్చించాలనే ఆశతో ఆరుబయట ఆటలు ఆడటం, టీవీ చూడటం , ఇతర విషయాలపై ఆంక్షలు తరచుగా విధిస్తూ ఉంటారు. అయితే, చైనాలోని ఒక జంట సాంప్రదాయక విద్యా విధానానికి భిన్నంగా వ్యవహరించారు.

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తమ కొడుకు అడ్మిషన్‌లో జాప్యం కారణంగా, ఆ దంపతులు తమ కారు , ఫ్లాట్‌ని విక్రయించిన తర్వాత తమ ఆరేళ్ల కుమారుడిని దేశవ్యాప్త  లెర్నింగ్  పర్యటన కోసం తీసుకెళ్లారు. కుటుంబం క్యాంపర్ వ్యాన్‌లో ప్రయాణిస్తుంది. హెనాన్ టీవీ సిటీ ఛానెల్ వారు కనీసం పది ప్రావిన్సులకు ప్రయాణించారని , పర్యటన కొనసాగుతోందని చెప్పారు. ఈ ఫ్యామిలీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ జంట సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందినవారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) నివేదిక ప్రకారం, చైనాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరడానికి పిల్లల కనీస వయస్సు ఆరు సంవత్సరాలు ఉండాలి. చిన్నారి 2023 సెషన్‌కు చేరుకోవడానికి కేవలం తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉంది. తమ కొడుకుని  అనుమతించే ప్రైవేట్ పాఠశాలను ఎంచుకోవడానికి బదులుగా, యాంగ్ కియాంగ్ (తండ్రి) , అతని భార్య ఒక సంవత్సరం పాటు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అతని ప్రవేశాన్ని ఆలస్యం చేసారు. అటువంటి పరిస్థితిలో, వారు తమ బిడ్డను ఒక సంవత్సరం పాటు లెర్నింగ్ టూర్‌కు తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. వారు ఇప్పుడు ఈ సమయాన్ని ప్రయాణానికి, బోధించడానికి , పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఉపయోగిస్తున్నారు.

పుస్తక జ్ఞానం కంటే ట్రావెల్ లెర్నింగ్  ప్రయోజనాలను తమ కొడుక్కి నేర్పించాలని వారు అనుకున్నారు. అందుకే.. ఈ నిర్ణయం తీసుకున్నారు. పుస్తకంలో నేర్చుకునేదానికంటే.. ఈ ప్రయాణంలోనే ఎక్కువ నేర్చుకుంటాడనే నమ్మకం తమకు ఉందని వారు చెప్పడం విశేషం. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత.. ఈ పేరెంట్స్ నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తుండటం విశేషం. ఇది కదా పేరెంటింగ్ అంటే.. వీళ్లు కదా పేరెంట్స అంటే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఈ పేరెంట్స్ తీసుకున్న నిర్ణయానికి మీరేమంటారు..?

click me!