కరోనా వైరస్ సోకినట్లు గుర్తించిన ఆ మహిళల్ని ఐసోలేషన్‌లో ఉంచి వైద్యులు ట్రీట్ మెంట్ అందించారు. అందులో ముగ్గురు మహిళలు పరీక్షలకు అంగీకరించగా.. మరో మహిళ ఆ సాహస నిర్ణయానికి వెనుకాడినట్లు సమాచారం.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే రెండున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. నువ్వు, నేను, పెద్దా-చిన్నా అనే తేడా లేకుండా అందరికీ ఈ వైరస్ సోకుతోంది. ఈ వైరస్ విషయంలో పరిశోధకులు గర్భిణీలకు మాత్రం ఓ శుభవార్త తెలియజేశారు.
గర్భిణీలకు కరోనా వైరస్ రాదా అని అనకుండి.. వాళ్లకి కూడా వస్తుంది. కానీ.. వాళ్లకి సోకినా.. వాళ్ల కడుపులో బిడ్డ మాత్రం క్షేమంగా ఉంటుంది అని చెబుతున్నారు. ఈమేరకు నిపుణులు చేసిన పరిశోధనలో తేలింది.
ప్రమాదకర వైరస్ ఎట్టి పరిస్థితుల్లోనూ డెలివరీ సమయంలో నవజాత శిశువులకు సంక్రమించదని ఫ్రాంటియర్స్ ఇన్ పీడియాట్రిక్స్ అనే జర్నల్‌లో ఈ విషయాలు వెల్లడించారు. కరోనా సోకిన నలుగురు గర్భవతులు ఇటీవల వూహాన్ ఆస్పత్రిలో శిశువులకు జన్మనివ్వగా.. వారి నుంచి కరోనా వైరస్ పిల్లలకు సోకలేదని గుర్తించారు.
కరోనా వైరస్ సోకినట్లు గుర్తించిన ఆ మహిళల్ని ఐసోలేషన్‌లో ఉంచి వైద్యులు ట్రీట్ మెంట్ అందించారు. అందులో ముగ్గురు మహిళలు పరీక్షలకు అంగీకరించగా.. మరో మహిళ ఆ సాహస నిర్ణయానికి వెనుకాడినట్లు సమాచారం.
ఆ మహిళలు జన్మనిచ్చిన శిశువులకు ఇతరత్రా చిన్న చిన్న సమస్యలు కనిపించాయని, వారం రోజుల్లో అంతా సక్రమంగానే ఉందని వైద్యులు చెప్పారు. అయితే కోవిడ్19 వైరస్ తల్లి నుంచి నవజాత శిశువుకు సోకినట్లు ఎక్కడా తేలకపోవడం శుభసూచకమని భావిస్తున్నారు. హువాజాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ అధ్యయనం చేసింది. అయితే.. బిడ్డ పుట్టిన తర్వాత కరోనా సోకిన తల్లి వద్ద ఉంచితే మాత్రం వైరస్ సోకే అవకాశం ఉందని.. ఆమెకు బిడ్డను దూరంగా ఉంచితే క్షేమంగా ఉంచవచ్చని చెబుతున్నారు.