ఇది అండం, వీర్యం కలవకుండా చేస్తుంది. ఫలోపియన్ గొట్టాల నుంచి అండం కిందకి రావడాన్ని ఆలస్యం చేస్తుంది. అండం గర్భసంచిలో కుదురుకోకుండా కాపాడుతుంది. ఇంగ్లీష్ టీ అక్షరం ఆకారంలో ఉంటుంది. ఇది చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది.
చాలా మందికి పెళ్లి వెంటనే పిల్లలను కనాలని ఉండదు. మరి కొందరికి..బిడ్డ కీ బిడ్డకీ కనీసం మూడు, నాలుగు సంవత్సరాలైనా గ్యాప్ ఉండాలి అని అనుకుంటారు. దీని కోసం చాలా మంది.. గర్భనిరోదక మాత్రలను ఎంచుకుంటారు. లేదంటూ కండోమ్ ని ఆప్షన్ గా భావిస్తారు. అయితే.... ఈ గర్భనిరోదక మాత్రలు వాడటం వల్ల ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అలా కాదని.. కండోమ్ వాడితే... భావప్రాప్తి తక్కువగా కలుగుతుంది. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. లూప్ ఉందంటున్నారు నిపుణులు. స్త్రీలు వెంటనే బిడ్డలను కలగకుండా ఉండేందుకు ఈ లూప్ ని వేస్తారు. దీనిని ఐయూసీడీ( ఇంట్రాయూటెరిన్ కాంట్రా సెప్టివ్ డివైస్) అని అంటారు. అంటే గర్భాశయంలో అమర్చే గర్భనిరోధక సాధనం అని అర్థం.
ఇది అండం, వీర్యం కలవకుండా చేస్తుంది. ఫలోపియన్ గొట్టాల నుంచి అండం కిందకి రావడాన్ని ఆలస్యం చేస్తుంది. అండం గర్భసంచిలో కుదురుకోకుండా కాపాడుతుంది. ఇంగ్లీష్ టీ అక్షరం ఆకారంలో ఉంటుంది. ఇది చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది. ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. దీనికి పల్చటి రాగితీగ చుట్టి ఉంటుంది. ఇది వేయించుకున్నప్పటికీ కలయిక సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు.
లూప్ వేయించుకున్నాక ఏదైనా సమస్య ఉంటే.. రెండు, మూడు నెలల్లోనే అది బయటకు వస్తుంది. అలా రాలేదు అంటే.. ఎలాంటి సమస్య లేదని అర్థం. చాలా కొద్ది మందికి మాత్రమే లూప్ వేయించుకున్నాక నొప్పి ఉంటుంది. దానికి కొద్ది రోజులు మందులు వాడితే సరిపోతుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
కాకపోతే లూప్ వేయించుకున్నాక మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి దీనిని మార్చుకోవాల్సి ఉంటుంది. మళ్లీ పిల్లలు కావాలి అని అనుకున్నప్పుడు దానిని డాక్టర్ల సహాయంతో దానిని తీయించుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.