అమితమైన తల్లి ప్రేమ... బిడ్డ ఉన్నతికి సోపానం

By telugu teamFirst Published Nov 5, 2019, 12:59 PM IST
Highlights

తల్లి ప్రేమానురాగాలను బాగా పొందిన పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. అంతేకాదు... వైవాహిక జీవితంలో మరింత ఎక్కువ ఆనందాన్ని ఆస్వాదిస్తూ... మతిమరుపు సమస్యలు తక్కువగా ఉంటున్నట్టూ తేలడం విశేషం. 

ప్రపంచంలో అన్నింటికన్నా.. తల్లి ప్రేమ గొప్పదని ఎవరిని అడిగినా చెబుతున్నారు. ఈ ప్రపంచంలో మనం అందరికీ నచ్చకపోవచ్చు. కొందరికి మాత్రమే నచ్చవచ్చు. నచ్చకపోవడానికి మనలో అవతలి వారికి ఏదో ఒక లోపం, కారణం కనపడుతుంది. కానీ.. మనం ఎలా ఉన్నా... అందంగా ఉన్నా లేకున్నా... లోపంతో ఉన్నా... రంగు ఏదైనా... కన్న తల్లి కంటికి మాత్రం అందంగానే కనిపిస్తాం. ఆమె మనపై చూపే ప్రేమ కూడా అంతే అందంగా ఉంటుంది.

చాలా మంది అనుకుంటారు.. తల్లి తన ప్రేమ.. బిడ్డ చిన్నవయసులో ఉన్నప్పుడు చూపిస్తే సరిపోతుందని. అవును.. నిజమే... కానీ చిన్నతనంలో ఆమె ఎంత ప్రేమ  చూపిస్తే... భవిష్యత్తులో బిడ్డ భవిష్యత్తు అంత బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.

బిడ్డ మీద తల్లి చూపే ప్రేమ, ఆప్యాయతలు కేవలం బాల్యానికే పరిమితం కావని ఓ పరిశోధనలో తేలింది. సుమారు 4వేల మందిని పరిశీలించి పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. చిన్నప్పుడు తల్లి తమతో మాట్లాడుతున్నప్పుడు ఎంత ఆనందంగా కనిపించేది..? ఎన్నిసార్లు హగ్ చేసుకునేది..? వంటి ప్రశ్నలతో వారి మధ్య అనుబంధాన్ని అంచనా వేశారు.

దాదాపు 18 సంవత్సరాలపాటు దీనిపై పరిశోధనలు జరిపారు. కాగా... తల్లి ప్రేమానురాగాలను బాగా పొందిన పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. అంతేకాదు... వైవాహిక జీవితంలో మరింత ఎక్కువ ఆనందాన్ని ఆస్వాదిస్తూ... మతిమరుపు సమస్యలు తక్కువగా ఉంటున్నట్టూ తేలడం విశేషం. 

అంతేకాకుండా..తల్లి స్వచ్ఛమైన ప్రేమ.. భవిష్యత్తులో బిడ్డ ప్రేమ బంధానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. వారి ప్రేమ, పెళ్లి బంధాలు ఎంతో ధృడంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 

click me!