ప్రస్తుతకాలంలో.. పిల్లలు పుట్టక చాలా మంది దంపతులు ఇబ్బందులు పడుతున్నారు. వారంతా ఫెర్టిలిటీ సెంటర్ ల చుట్టూ.. వైద్యుల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి వారే.. ఇప్పుడు పిల్లలు వద్దులే అని అనుకుంటున్నారట.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. బయటకు అడిగిపెడితే చాలు.. కరోనా ఎక్కడ సోకుతుందో అని భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది దంపతులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇటీవల జరిపిన ఓ సర్వేలో ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. కరోనా భయంతో చాలా మంది పిల్లలు వద్దు అని అనుకుంటున్నారా.. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం.
ప్రస్తుతకాలంలో.. పిల్లలు పుట్టక చాలా మంది దంపతులు ఇబ్బందులు పడుతున్నారు. వారంతా ఫెర్టిలిటీ సెంటర్ ల చుట్టూ.. వైద్యుల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి వారే.. ఇప్పుడు పిల్లలు వద్దులే అని అనుకుంటున్నారట.
కరోనా కారణంగా గర్భం దాల్చాక ఆరోగ్యం ఎలా ఉంటుందోననే ఆందోళనే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గర్భంతో ఉండగా కరోనా సోకితే ఎలా అనే భయంతో 73శాతం మంది పిల్లలు వద్దనుకుంటున్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. దీనికి తోడు ప్రస్తుతం ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కూడా ప్రెగ్నెన్సీని వాయిదా వేస్తున్నట్లు 88శాతం మంది చెప్పారట.
మరోవైపు ఇలా వాయిదా కారణంగా గర్భం ధరించాల్సిన వయసులో ధరించకపోవడం వల్ల వచ్చే ఇతరత్ర సమస్యలు ఉత్పన్నమవుతాయనే భయాలూ వెన్నాడుతున్నప్పటికీ.. వాయిదాకే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు.
అనుకోకుండా ప్రెగ్నెన్సీ వస్తే ఓకే గానీ.., ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకునేవారు మాత్రం కొంతకాలం వెయిట్ చేయమనే చెబుతున్నాం. గర్భిణిగా ఉన్నప్పుడు ఊపిరి తిత్తులు, గుండె.. ఇలా ప్రతి అవయవం మార్పునకు లోనవుతుంది. ఒక్కోసారి కొందరికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అవుతుంటుంది. ఇలాంటప్పుడు కరోనా ఎఫెక్ట్ అయితే కష్టమని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అసలే కరోనా కి మందు కూడా లేకపోవడంతో.. గర్భం రాకపోవడమే బెటర్ అని భావిస్తుండటం గమనార్హం.