ఉద్యోగం చేసే తల్లిదండ్రులు కచ్చితంగా తెలుసుకోవాల్సినవి ఇవి

Published : May 12, 2025, 06:32 PM IST
ఉద్యోగం చేసే తల్లిదండ్రులు కచ్చితంగా తెలుసుకోవాల్సినవి ఇవి

సారాంశం

బిజీ లైఫ్ లో పిల్లలను పెంచడం చాలా కష్టం. టైం మేనేజ్మెంట్, టెక్నాలజీ సరిగ్గా వాడడం, పిల్లలకి ప్రత్యేక సమయం ఇవ్వడం కుదరడం లేదా? అయితే, మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూసేయండి..

ఈ రోజుల్లో లైఫ్ చాలా ఫాస్ట్ గా, బిజీగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులైన తల్లిదండ్రులకు పిల్లలను సరిగ్గా పెంచడం పెద్ద బాధ్యత. ఆఫీస్ పని, ఇంటి పని, పిల్లల అవసరాలు చూసుకోవడం చాలా కష్టమైపోతుంది . ఆఫీసు పనులతోనే సగం అలసిపోతారు. ఇక పిల్లల బాగోగులు చూసుకోవడం మరో అదనపు టాస్క్. మీరు కూడా ఇదే విషయంలో బాధపడుతున్నారా? అయితే.. కొన్ని సులభమైన, ఉపయోగకరమైన చిట్కాలు పాటిస్తే పిల్లల బాగోగులు చూసుకుంటూనే కుటుంబంలో ఆనందం నింపుకోవచ్చు. మీ పెంపకాన్ని సులభతరం చేసే, పిల్లలతో మీ బంధాన్ని బలపరిచే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

1. సమయాన్ని సరిగ్గా వాడుకోండి

ఉద్యోగస్తులైన తల్లిదండ్రులు తమ సమయాన్ని సరిగ్గా పంచుకోవాలి. రోజంతా బిజీగా ఉన్నా పిల్లల కోసం కొంత సమయం కేటాయించాలి. కొన్ని నిమిషాలు ఆటలాడడం లేదా పడుకునే ముందు మాట్లాడడం లాంటి చిన్న చిన్న విషయాలు పిల్లలకు చాలా ముఖ్యం. రోజులో కొద్ది సమయం పిల్లలకు ఇస్తే మీ బంధం బలపడుతుంది.

2. టెక్నాలజీని సరిగ్గా వాడండి

టెక్నాలజీ మనకు సహాయపడుతుంది. పిల్లలతో వీడియో కాల్ లో మాట్లాడొచ్చు, ఆన్లైన్ లెర్నింగ్ యాప్స్ వాడొచ్చు. కానీ పిల్లల స్క్రీన్ టైం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. టెక్నాలజీని నేర్చుకోవడానికి, కనెక్ట్ అవ్వడానికి వాడాలి, టైం పాస్ కి కాదు.

3. పిల్లల కోసం ప్రత్యేక సమయం కేటాయించండి

రోజంతా బిజీగా ఉన్నా, పిల్లలతో ప్రతిరోజూ కొంత సమయం గడపడం చాలా ముఖ్యం. వాళ్ళతో కలిసి భోజనం చేయండి, కథలు చెప్పండి, వాళ్ళ అనుభవాలు వినండి. దీనివల్ల పిల్లలు మీకు ముఖ్యమని, వాళ్ళ మాటలు మీకు విలువైనవని భావిస్తారు.

4. సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి

ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు రెండూ సమన్వయం చేసుకోలేకపోతే కుటుంబం లేదా స్నేహితుల సహాయం తీసుకోండి. ఇంట్లో సహాయకులు ఉంటే వాళ్ళతో కొన్ని పనులు పంచుకోండి. దీనివల్ల పిల్లలకు ఎక్కువ సమయం, శ్రద్ధ ఇవ్వగలుగుతారు.

5. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి

ఉద్యోగస్తులైన తల్లిదండ్రులు తమ గురించి మర్చిపోతారు. కానీ మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటం ముఖ్యం. మంచి ఆహారం, కొద్దిగా వ్యాయామం, తగినంత నిద్ర మీకు శక్తినిస్తాయి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలకు మంచి వాతావరణం ఇవ్వగలుగుతారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kids Health: పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు అరటిపండు, పెరుగు పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది?
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ సూపర్ ఫుడ్స్ పెడితే చాలు!