ప్రతి పేరెంట్స్ తమ కూతురికి చెప్పాల్సిన విషయాలు ఇవి

By Shivaleela RajamoniFirst Published Aug 22, 2024, 9:53 AM IST
Highlights

ప్రస్తుతం అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పిల్లలపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అందుకే ప్రతి పేరెంట్స్ తమ  కూతుర్లకి కొన్ని విషయాలు చెప్పాలి. అవేంటంటే? 
 

నేటి కాలంలో అమ్మాయిలకు రక్షణంటూ లేకుండా పోయింది. బయటకు వెళ్లిన బిడ్డ మళ్లీ ఇంటికి వచ్చేదాకా ప్రతి పేరెంట్స్ కు ఒకలాంటి భయమంటూ ఉంటుంది. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇది ఒక్క మహిళలకే కాదు చిన్న చిన్న అమ్మాయిలకు కూడా జరుగుతోంది. అందుకే ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులు భయపడుతూ బతుకుతున్నారు. మీ బిడ్డ క్షేమంగా ఉండాలంటే మాత్రం వారికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత మీ చిన్నారి ప్రతి విషయాన్ని మీతో చేసుకునేలా చేయాలి. అందుకే కూతురితో ప్రతిపేరెంట్స్ ఏం చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

శరీర భాగాల గురించి: ప్రతి తల్లి తన కూతురికి ఆమె శరీర భాగాల గురించి వివరించాలి. ఎవరైనా వారి ప్రైవేట్ భాగాలను కానీ తాకడానికి ప్రయత్నిస్తే ఎలా ప్రతిఘటించాలో వారికి నేర్పాలి అలాగే అలా ప్రవర్తించిన వ్యక్తి గురించి తల్లిదండ్రులకు ఖచ్చితంగా చెప్పాలని వారికి నేర్పాలి. 

Latest Videos

నో చెప్పడం: పిల్లలకు నో చెప్పడం ఖచ్చితంగా నేర్పాలి. అంటే వారు బయటకు వెళ్లినప్పుడు ఎవరైనా ప్రేమగా ఏదైనా ఇచ్చినా, లేదా ఎక్కడికైనా వెళదామని నేరుగా అడిగినా.. వారికి నో చెప్పడం నేర్పాలి. అలాగే అలాంటి వారితో మాట్లాడకూడదని పిల్లలక చెప్పాలి. ఎవ్వరినీ శరీరాన్ని తాకనివ్వకూడదని చెప్పాలి. 

బ్యాడ్ టచ్: ప్రతి పేరెంట్స్ బ్యాడ్ టచ్ గురించి ఖచ్చితంగా నేర్పాలి. ఎవరైనా తమను తాకినప్పుడు అది వారికి మంచి అనుభూతిని కలిగించకపోయినా, అసౌకర్యంగా అనిపించినా అది బ్యాడ్ టచ్ అని వారికి చెప్పాలి. ఇలా వారితో ఎవరైనా ప్రవర్తిస్తే వెంటనే తల్లిదండ్రులకు చెప్పమని నేర్పాలి. 

గుడ్ టచ్: గుడ్ టచ్, బ్యాడ్  మధ్య వ్యత్యాసాన్ని ఖచ్చితంగా కూతురికి నేర్పాలి. ఒక వ్యక్తి పిల్లల తల లేదా నుదుటిని ప్రేమతో తాకినప్పుడు అది మంచి స్పర్శ అవుతుంది. ఇలా కాకుండా వారి బుగ్గలు లాగడం,  తట్టడం బ్యాడ్ టచ్ కిందికి వస్తాయని పిల్లలకు నేర్పాలి. 

ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి: మీ కూతురు ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలో చెప్పండి. అంటే.. ఎవరైనా వారిని బలవంతంగా వారి ఒడిలో కూర్చోబెట్టుకున్నా, వారిని తాకినా లేదా ముద్దు పెట్టడానికి ప్రయత్నించినా వెంటనే అక్కడి నుంచి పారిపోవాలని పిల్లలకు చెప్పాలి. 

3 నుంచి 4 సంవత్సరాల కుమార్తెకు ఈ విషయాలు నేర్పండి:  3 నుంచి 4 సంవత్సరాల వయస్సులో ఉన్న కూతురికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య తేడాను ఖచ్చితంగా చెప్పాలి. అలాగే రోజూ వారితో కాసేపు మాట్లాడండి. అయితే అమ్మాయిలు ఏదైనా తప్పు జరిగినప్పుడు తల్లిదండ్రులకు అంత తొందరగా ఏం చెప్పరు. కాబట్టి వారి ప్రవర్తనపై శ్రద్ధ వహించాలి. కూతురి ప్రవర్తనలో తేడా కనిపిస్తే కచ్చితంగా ఆమె దగ్గర కూర్చొని ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయండి.
 

click me!