
పిల్లల సంరక్షణ: చిన్న పిల్లలు చాలా మంది ఏది కనపడితే అది నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. పిల్లల్లో ఈ అలవాటు చాలా సహజం. కానీ, నాణేలు, బటన్స్ వంటి చిన్న వస్తువులు నోట్లో పెట్టుకుంటే చాలా ప్రమాదం. ఒక్కోసారి కొన్ని వస్తువులు వారి గొంతులు ఇరుక్కుపోయే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటప్పుడు ఏం చేయాలో నిపుణుల సలహాలు ఇక్కడ ఉన్నాయి.
చైల్డ్ న్యూట్రిషనిస్ట్ చారు పంచోలి ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఒక వీడియోలో వివరించారు. పిల్లల నోట్లో ఏదైనా వస్తువు ఉంటే తల్లిదండ్రులు కంగారు పడకుండా సరైన చర్యలు తీసుకోవాలి.
పిల్లలు నోట్లో ఏదైనా వస్తువు పెట్టుకుంటే వెంటనే వారి దగ్గరకు వెళ్లి వారి ముక్కును నెమ్మదిగా మూయాలి. దాంతో పిల్లలు నోరు తెరుస్తారు. అప్పుడు వస్తువును బయటకు తీయవచ్చు.
ఈ ట్రిక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ, కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
నోట్లో వస్తువు కనిపిస్తున్నప్పుడు మాత్రమే ఈ ట్రిక్ ఉపయోగించాలి. వస్తువు గొంతు దగ్గర ఉంటే ఈ ట్రిక్ ప్రమాదకరం. వస్తువు లోపలికి వెళ్ళే ప్రమాదం ఉంది.