గాల్వాన్ ఉదంతానికి సంవత్సరం: వేచి చూసే ధోరణిలో చైనా, భారత్ సన్నద్ధమవ్వాల్సిందే...

By team teluguFirst Published Jun 1, 2021, 7:54 PM IST
Highlights

భారత్, చైనా సంబంధాలపై గాల్వాన్ లోయ ఉదంతం తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఒకరకంగా ఇది గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు

భారత్, చైనా సంబంధాలపై గాల్వాన్ లోయ ఉదంతం తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఒకరకంగా ఇది గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు. ఎల్ఏసి వెంట బలగాల ఉపసంహరణ జరగడాన్ని పర్యవేక్షించడానికి వెళ్లిన భారతీయ సైనికులు, చైనా సైనికుల మధ్య చిలికిచిలికి గాలివానలా మారి ఇరు పక్షాల్లో భారీ మరణాలు సంభవించాయి. ఈ ఉదంతం తరువాత భారత్, చైనా దేశాల మధ్య సంబంధాల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులపైనా ఇది ప్రభావం చూపెట్టింది. 

చైనాకు స్నేహ హస్తం అందిస్తూ కలిసి సాగుదాం అంటున్న భారత్ వంటి శాంతి కాముఖ దేశంతో నెరుపుతున్న స్నేహ సంబంధాన్ని కూడా కాలరాయాలని నిశ్చయించుకొని... భారత్ లో కరోనా మహమ్మారి తన పంజా విసురుతున్న 2020 ఏప్రిల్ - మే సమయంలో అదనపు బలగాలను గాల్వాన్ ప్రాంతానికి పంపి కొన్ని టాక్టికల్ పాయింట్స్ ని ఆదేనంలోకి తీసుకుని కవ్వింపు చర్యలకు దిగింది చైనా. 

ఆ ప్రాంతంలో మోహరించిన చైనా బలగాలు వాస్తవానికి ఒక ఫుల్ టైం వార్ ని పోరాడడానికి సరిపడా సంఖ్యా బలం ఉన్నవి కాదు. వాటిని అక్కడ మోహరించడానికి ప్రధాన ఉద్దేశం స్నేహపూర్వక మైత్రి వాతావరణాన్ని చెడగొట్టేలా కవ్వింపు చర్యలకు దిగడమే. జూన్ 6 2020న జరిగిన మీటింగ్ లో బలగాల ఉపసంహరణకు ఇరు పక్షాలు అంగీకరించాయి. 

చైనా వైపున బలగాల ఉపసంహరణను సమీక్షించడానికి వెళ్లిన కల్నల్ సంతోష్ బాబు బృందం పై కనీవినీ ఎరుగని ఆయుధాలతో అత్యంత పాశవికంగా చైనా బలగాలు దాడి చేసిన విషయం తెలిసింది. ఈ ఉదంతంతో ఇరు పక్షాలు భారీగా బలగాలను మోహరించాయి. ఈ బలగాల మోహరింపుతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొన్ని నెలలపాటు సాగాయి. 

ఇక చైనా దురాగతానికి వారి భాషలోనే సమాధానా ఇస్తూ భారత్ ఛుషుల్ ప్రాంతంలో కొన్ని ముఖ్య స్థావరాలను ఆక్రమించింది. దీనితో చైనా స్థావరాలపై భారత్ పైచేయి సాధించినట్టయింది. చేసేదేమి లేక చైనా అక్రమంగా ఆక్రమించిన ఫింగర్స్ ప్రాంతాన్ని ఖాళీచేసి వెనుతిరగవలిసి వచ్చింది. 

ప్రస్తుతం కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వల్ల మనకు అక్కడి సమాచారం అందడంలేదు కానీ అక్కడ పరిస్థితులైతే గంభీరంగానే ఉన్నాయి. ఈ సందర్భంలో మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలి 

ఇప్పటికి కూడా చైనా గాల్వాన్ లో ఎందుకు ఆ చర్యకు దిగిందని మనం చెప్పలేకపోతున్నాము. 1962 మాదిరి వచ్చి భూభాగాన్ని ఆక్రమించి, ఒక సరిహద్దు యుద్ధాన్ని ఆరంభించి ఆ తరువాత ఖాళీచేసి వెళ్లిపోవడం అంతా కూడా అంతుబట్టని ప్రశంలాగానే మిగిలిపోయింది. చూడడానికి సాధారణంగా కనిపించినా 2020లో చైనా ఈ తరహా చర్యకు దిగడం వెనుక బలమైన స్ట్రాటజిక్ కారణం ఉంది. 

చైనా మిలిటరీ ఇంటలిజెన్స్ ట్రంప్ గెలుస్తాడని నమ్మడం, ఆఫ్గనిస్తాన్, పశ్చిమాసియా దేశాలు ప్రశాంతంగా ఉండడం, రానున్న రోజుల్లో పసిఫిక్ మహాసముద్రంలో చైనా వ్యతిరేక బలమైన శక్తిని ఏర్పాటు చేయడానికి అమెరికా ప్రయత్నిస్తుండడం, దానికి భారత్ సహాయం ఖచ్చితంగా అవసరం అని వారు భావించారు. 

ప్రధానంగా సాగర క్షేత్రం గురించి చైనా మధనపడింది. పసిఫిక్ తీరంలో అమెరికా ఉన్నప్పటికీ... హిందూ మహాసముద్రంలో గనుక భారత్ అమెరికా ఒక్కటైతే తమకు తీవ్ర ముప్పు తప్పదని గ్రహించిన చైనా ఈ దురాగతానికి ఒడిగట్టింది. కానీ సరిహద్దుల్లో భారత్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తే అమెరికాకి దూరమవుతుందని ఎలా లెక్కగట్టింది చైనా..? దానికి పూర్తి వ్యతిరేకంగా కూడా పరిస్థితులు చోటుచేసుకోవచ్చు. చైనా ఉద్దేశాలను ముందే పసిగట్టిన భారత్... తన తడువుగారి చర్యను ముందే డిసైడ్ అయిపోయింది. 

సరిహద్దుల వద్ద ప్రస్తుతానికి బలగాల ఉపసంహరణ జరిగినప్పటికీ... గాల్వాన్ ఉదంతం తరువాత చైనా చర్యలు నమ్మశక్యంగా లేవు. ఇందుకోసం దాదాపుగా 60,000 సైనిక బలగాన్ని సిద్ధంగా స్టాండ్ బై మోడ్ లో ఉంచవలిసి వచ్చింది. చైనా స్టాండ్ ఆఫ్ గేమ్ ని తనకు అనుకూలంగా ఆడుతుంది. ప్రస్తుతానికి చర్చలు కొనసాగుతున్నప్పటికీ... అవి పూర్తిస్థాయిలో సమస్యలకు పరిష్కారం మాత్రం కాదు. 

ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు మార్పుని సూచిస్తున్నాయి. ఇది ఒక్కరోజులో జరిగేది కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్ పై తమ ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంది చైనా. ఇంతవరకు చైనా భారత్ పై ఆధిపత్యం చలాయించింది లేదు. కానీ మనం ప్రపంచ దృష్టిలో కూడా మన సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించవలిసి ఉంటుంది. 

గతంలో చైనాకి ధీటుగా సమాధానం చెప్పేందుకు మన బలగాలు సన్నద్ధమైన తీరు అమోఘం. కానీ అది మాత్రమే సరిపోదు. చైనా మరోసారి మావో కలం నాటి టెక్నీక్లను ఉపయోగిస్తుందని అనుకోవడానికి వీల్లేదు. వారు రకరకాల కవ్వింపు చర్యలకు దిగే ఆస్కారం ఉంది. వాటన్నిటికీ సరైన రీతిలో సమాధానం చెప్పేందుకు మనం సిద్ధంగా ఉండాలి. కరోనా తో భారత్ విలవిల్లాడుతుంటే రాక్షసానందం పొందుతున్న దేశాన్ని మనం నమ్మడానికి వీల్లేదు. 

రచయిత లెఫ్టనెంట్ జనరల్ (రిటైర్డ్) అతా హస్నైన్ శ్రీనగర్ కేంద్రంగా పనిచేసిన 15 కో కమాండర్ గా పనిచేసారు. ప్రస్తుతం కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ కి ఛాన్సలర్ గా కొనసాగుతున్నారు. ఈ ఆర్టికల్ తొలుత న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో జూన్1న ప్రచురితమైనది. 

click me!