యాక్టింగ్ వద్దు యాక్షన్ కావాలి

Published : Nov 10, 2017, 01:31 PM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
యాక్టింగ్ వద్దు యాక్షన్ కావాలి

సారాంశం

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు చంద్రబాబుపై మండిపడ్డ రోజా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో కోడెల యాక్టింగ్ ఆపి.. యాక్షన్ తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలను వ్యతిరేకిస్తూ.. వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజా మీడియాతో మాట్లాడారు.

మూడున్నరేళ్లుగా జగన్.. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై నిలదీశారని గుర్తు చేశారు. ధైర్యముంటే జగన్ తో పాటు నడవాలని సవాల్ విసిరారు. ప్రజల గురించి, రాష్ట్రం గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచించరన్నారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలనే టీడీపీ నేతలు నిరంతరం ఆలోచిస్తుంటారన్నారు. చిత్తశుద్ధి ఉంటే.. అసెంబ్లీ సమావేశాలు ఇన్ని రోజులు ఎందుకు జాప్యం చేశారంటూ నిలదీశారు. జగన్ పాదయాత్ర చేస్తున్నారని తెలిసే.. ఇప్పుడు సమావేశాలు పెట్టారంటూ మండిపడ్డారు.

ఇప్పటికైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే.. తాము సమావేశాలకు హాజరౌతామని రోజా స్పష్టం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కోడెల యాక్టింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన యాక్షన్ తీసుకొని ఉంటే తాము కోర్టుకు వెళ్లేవాళ్లం కాదని చెప్పారు. గతంలో తనను అసెంబ్లీ రూల్స్ కి వ్యతిరేకంగా ఏడాది సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు తాను కోర్టును ఆశ్రయిస్తే.. కోర్టు నిర్ణయం చెల్లదని స్పీకర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఫిరాయింపులు చేశారని, సంతలో పశువులు కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నారు.

గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చింది చంద్రబాబేనన్నారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతారని చంద్రబాబుకి తెలుసని.. అందుకే ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !