ఫ్లిప్ కార్ట్ నుంచి స్మార్ట్ ఫోన్..! అదీ బడ్జెట్ ధరలో

Published : Nov 10, 2017, 12:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ఫ్లిప్ కార్ట్ నుంచి స్మార్ట్ ఫోన్..! అదీ బడ్జెట్ ధరలో

సారాంశం

మొబైల్ రంగంలోకి అడుగుపెట్టిన ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేస్తున్న ఫ్లిప్ కార్ట్ బడ్జెట్ ధరల్ ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్

ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ గురించి తెలియని వాళ్లు ఉండరు. ఈ ఫ్లిప్ కార్ట్ లో డ్రెస్సులు, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, మొబైల్ ఫోన్లు, గ్యాడ్జెట్స్ లాంటివి ఎన్నో కొనుగోలు చేసి ఉంటారు. అయితే.. ఇప్పటి వరకు ఫ్లిప్ కార్ట్ నుంచి కొనుగోలు చేసిన మొబైల్  ఫోన్లన్నీ.. ఇతర కంపెనీలకు సంబంధించినవన్న విషయం మన అందరికీ తెలిసిందే. అలాకాకుండా.. ఫ్లిప్ కార్ట్ సంస్థ.. స్వయంగా ఒక కొత్త మోడల్ ఫోన్ ని విడుదల చేయాలనుకుంటోంది.

‘‘క్యాప్చర్ +’’ పేరుతో ఈ నెల 15వ తేదీన ఓ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఈ క్యాప్చర్ +  స్మార్ట్ ఫోన్ కి డ్యూయల్ కెమేరా సదుపాయం కలదు. ఈ కెమేరాలకు నైట్ మోడ్  ఎఫెక్ట్, ఫోటోగ్రఫీ ఎఫెక్ట్ ‘బొకే’( ఇదో రకం ఫోటోగ్రపీ ఎఫెక్ట్) ని కూడా ఏర్పాటు చేశారు. చాలా తక్కువ సమయంలో బ్యాటరీ ఛార్జ్ అవ్వడం  ఈ ఫోన్ మరో ప్రత్యేకత.  ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ నగ్గెట్. ఫుల్ హెచ్ డీ డిస్ప్లే సదుపాయం కలదు.

ఈ ఫోన్ ని విడుదల చేసేందుకు దేశ వ్యాప్తంగా 125 పట్టణాల్లోని 130 సర్వీస్ సెంటర్లతో ఒప్పందం కుదర్చుకున్నాయి. మరో విశేషం ఏమిటంటే.. ఈ ఫోన్ ని బడ్జెట్ ధరలోనే అందజేస్తున్నారు. రూ.10,999, రూ.12,999 ధరలతో రెండు రకాల వేరియేషన్స్ లో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ‘ స్మార్టన్’ అనే కంపెనీ సహాయంతో ఈ ఫోన్ లను తయారు చేశారు. కాగా.. ఇదే లేబుల్ కింద.. మిక్సీలు, గ్రైండర్లు, కుక్ వేర్, టీ  షర్ట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా త్వరలో అందించేందుకు ఫ్లిప్ కార్ట్ సన్నాహాలు చేస్తోంది.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu