ఎన్టీఆర్ కు భారతరత్న రాకపోవడడానికి ఇదీ కారణం

First Published May 29, 2017, 10:25 AM IST
Highlights

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు  ‘భారతరత్న’ యే నిజమయిన నివాళి  అని వైజాగ్ టిడిపి మహానాడులో ఒక తీర్మానం చేశారు. గత 20 ఏళ్లుగా కేంద్రం లో  కేంద్రంలో  చక్రం గిరగిర తిప్పుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  మహానేత ఎన్టీఆర్ కు భారత రత్న తీసుకురాలేకపోతున్నాడు. కారణం ఎమిటి?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు దేశ ‘భారతరత్న’ యే నిజమయిన నివాళి  అని వైజాగ్ టీడీపీ మహానాడులో ఒక తీర్మానం చేశారు.

ఇది మొదటి సారికాదు,ప్రతి మహానాడులో చేసే తంతే.

కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నాడని చెబుతున్నారు. అదే మహాసభలో మాట్లాడుతూ మూడుకాంగ్రె సేతర ప్రభుత్వాలను నిలబెట్టిన బాహుబలి తాననేనని కూడా చెప్పుకున్నారు.

ఇపుడు కూడా ఎన్డీయే లో ఆయన చక్రం తిరుగుతూ నే ఉందని చెబుతున్నారు. మరలాంటపుడు ప్రతిసంవత్సరం వార్షీకం లాగా ఈ తీర్మానాలేమిటి, చప్పట్టుకొట్టించడమేమిటి, ఒక సారలా చక్రం తప్పి

తెలుగు సంస్థాపకునికి ఈ అత్యున్నత గౌరవం దక్కించవచ్చుగదా...

ఎన్టీఆర్ కు భారత రత్న ఇప్పించాలనే కమిట్ మెంట్ తీర్మానం దాటిపోకపోవడానికారణం ఏమిటి?

టిడిపి సీనియర్ నాయకుల గుసగుసల్లో వినిపించేందేమిటో తెలుసా...

చంద్రబాబుఈ విషయంలో చక్రం తిప్పకపోవడానికి కారణం ఎన్టీర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి.

వాళ్లుచెబుతున్నదాని ప్రకారం, ఎన్టీఆర్ కు కేంద్రం మరణానంతర భారత రత్న ఇస్తే దానిని స్వీకరించాల్సింది భార్య లక్ష్మీ పార్వతియే. భార్య జీవించివున్నపుడు అవార్డు ఆమెయే తీసుకోవాలన్నది కేంద్రం నియమం అట.

అది చంద్రబాబునాయుడికి ఇష్టంలేదని వారు చెబుతున్నారు.

ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిందే ఆమె వల్ల.  అలాంటపుడు తాను చక్రం తిప్పి తీసుకు వచ్చిన భారత రత్న లక్ష్మీ పార్వతి తన్నుకుపోవడం ఆయనకు ఇష్టం లేదట.

ఈ కారణంగానే  బాబుగారు ఎన్టీఆర్ కు భారత  రత్న తీసుకువచ్చేందుకు చక్రం తిప్పడం లేదని ఈ గుసగుసల సారాంశం.

అంతవరకు తీర్మానాలు చేస్తునే ఉంటారు, విమర్శులు రాకుండా ఉండటానికి

click me!