మొత్తానికి ఎన్టీఆర్ ముసుగు తొలగింది

Published : May 28, 2017, 03:37 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
మొత్తానికి ఎన్టీఆర్ ముసుగు తొలగింది

సారాంశం

కడుపుమండిన తెలుగు తమ్ముళ్లెవరో  వైజాగ్ లో ఎన్టీ ఆర్ విగ్రహంమీద  మూడేళ్లుగా ఉన్న ముసుగు తీసేసి, తెలుగుదేశం పెద్దాయనకు విముక్తి కల్గించారు, ఈ రోజు.

మొత్తానికి విశాఖ పట్టణం రైల్వే న్యూ కాలనీ జంక్షన్ లో వున్న ఎన్టీ రామారావు విగ్రహానికి విముక్తి లభించింది. మూడేళ్లుగా ముసుగుదెయ్యంలా  వుండిపోయిన ఈ విగ్రహానికి మహానాడు సందర్భంగా ఆవిష్కరణ జరిగింది. అయితే,  మహానాడులో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడో, ఆయన కుమారడులోకేశ్ నాయుడో లేదా, ఎవరయినా ప్రముఖుడు ఈ విగ్రహావిష్కరణ చేశారనుకుంటున్నారా?

 

తప్పు,  ఈ విగ్రహానికి ఈ రోజు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ముసుగుతీసేసి తెలుగుదేశం పెద్దాయనకు వూరిరాడేలా చేశారు.

 

నగరంలోని ఒక ప్రధాన కూడలిలో మూడేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఈ విగ్రహావిష్కరణ జరగపోవడానికి కారణం అనధికారికంగా ఏర్పాటుచేయడం అని కొందరు చెబుతారు. మరికొందరు తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య అంతర్గత విభేధాలని చెబుతారు.

 

ముఖ్యమంత్రి ఈ రోజు  కొత్త తెలుగుదేశం పార్టీలో ఏర్పాటుచేసిన విగ్రహాన్ని ఆవిష్కరించారు గాని, దీని గురించి పట్టించుకోలేదు.

 

దీనితో కడుపుమండిన తెలుగు తమ్ముళ్లెవరో విగ్రహంమీద ముసుగు తీసేసి, ఎన్టీఆర్ కు విముక్తి కల్గించారు.

 

 

 

 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu