సునంద మృతిలో కొత్త కోణం...బయటపెట్టిన రిపబ్లిక్ టివి

First Published May 28, 2017, 6:56 PM IST
Highlights

అనుమానస్పద స్ధితిలో మరణించిన సునందకు న్యాయం చేయటానికి రిపబ్లిక్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే సునంద-రిపబ్లిక్ టివి రిపోర్టర్ ప్రేమా శ్రీదేవి మధ్య జరిగిన మొబైల్ సంభాషణలను కూడా టివి ప్రసారం చేసింది.

సునందా పుష్కర్ మరణంలోని మిస్టరీని ఛేదించటానికి ‘రిపబ్లిక్ టివి’ పూనుకుంది. అనుమానస్పద స్ధితిలో మరణించిన సునందకు న్యాయం చేయటానికి రిపబ్లిక్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే సునంద-రిపబ్లిక్ టివి రిపోర్టర్ ప్రేమా శ్రీదేవి మధ్య జరిగిన మొబైల్ సంభాషణలను కూడా టివి ప్రసారం చేసింది. మొబైల్ సంభాషణల ప్రకారం సునంద, ప్రేమతో మాట్లాడేందుకు పలుమార్లు ప్రయత్నించినా సాధ్య పడలేదు. అయితే, సునంద మృతికి సంబంధించిన కొన్ని అనుమానాలను రిపబ్లిక్ బయటపెట్టింది.

 

అవేంటంటే, సునంద, భర్త కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఢిల్లీ హోటల్లో తీసుకున్న 307 గది. కానీ చనిపోయారని ప్రకటించినపుడు సునంద ఉన్న గది 345. 307లో ఉండాల్సిన సునంద 345 నెంబర్ గదిలోకి ఎలా వచ్చిందన్నది పెద్ద ప్రశ్న. సునంద చనిపోవటానికి రెండు రోజుల ముందు ప్రేమతో మాట్లాడేందుకు తీవ్ర ప్రయత్నించారు. అసలు రిపోర్టర్ తో సునంద ఏం మాట్లాడదలుచుకున్నారో మిస్టరీగ మిగిలిపోయింది. పాకిస్ధాన్ జర్నలిస్ట్ మెహర్ థరార్ సన్నిహితంగా మెలుగుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై సునంద-శశికి బాగా గొడవ జరుగినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

 

చివరిసారిగా సునంద నుండి ఫోన్ కాల్ అందుకున్న ప్రేమ సునందను కలవటానికి హోటల్ కు వెళ్ళగా శశి సన్నిహితుడు ఆర్ కె శర్మ అడ్డుకున్నారు. గదిలో ఇద్దరూ మాట్లాడుకుంటున్నారని కాబట్టి ఎవరినీ పంపేందుకు లేదని పిఏ చెప్పారు. కొద్ది సేపటి తర్వాత ప్రయత్నిస్తే సునంద నిద్రపోతున్నందున మాట్లాడటం కుదరదని చెప్పారు. తర్వాత తెలిసిన విషయమేమిటంటే ఆరోజు రాత్రంతా ఇద్దరూ గదిలో పోట్లాడుకుంటున్నారని. ప్రేమ, సునందతో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

 

కొద్దిసేపటి తర్వాత సునంద, శశి పేర్లతో సంయుక్తంగా వెలువడిన ఓ ప్రకటనలో తమ ట్వట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు పేర్కొన్నారు. తర్వాత మరుసటి రోజే సునంద మరణించినట్లు ప్రకటన వెలువడటం రిపోర్టర్ ప్రేమను నివ్వెరపరిచింది. సునంద మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరించటానికి శశి ప్రయత్నిస్తున్నట్లు రిపబ్లిక్ ఆరోపిస్తోంది. అదే సమయంలో తనకు, సునందకు మధ్య జరిగిన ఆడియోటేపులు ఇతర ఆధారాలాను ఇచ్చినపుడు పోలీసులు తోసిపుచ్చారు. సునంద మరణం సహజమైనదేనంటూ రిపబ్లిక్ ఇచ్చిన ఆధారాలను కొట్టిపడేసారు. దాంతో సునంద-ప్రేమ మధ్య జరిగిన ఆడియో టేపులను బహిరంగపరచాలని రిపబ్లిక్ నిర్ణయించింది. సునందకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని అనుకుంటున్నది.

click me!