రాహుల్ గాంధీ సభకు పవన్ మద్దతు

First Published Jun 4, 2017, 12:37 PM IST
Highlights

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఆంధ్రా కాంగ్రెస్ రాహుల్  గాంధీని రాష్ట్రానికి రప్పించడం పట్ల తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేస్తే, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారు. "ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాటం చేసిన నా మద్దతు ఇస్తా. ప్రత్యేక హోదా కోసం గుంటూరు వేదికగా బహిరంగ సభ ఏర్పాటు చేసిన పీసీసీ చీఫ్ రగువీరా రెడ్డి కి నా అభినందనలు."

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఆంధ్రా కాంగ్రెస్ రాహుల్  గాంధీని రాష్ట్రానికి రప్పించడం పట్ల తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేస్తే, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారు. 

 ఈరోజు ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గుంటూరు వస్తున్నారు. ఆయన అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే భరోసా బహిరంగ సభలో పాల్గొంటున్నారు. అక్కడ ఆయన ప్రసంగించి, ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపు నిస్తారు. నిజానికి ప్రత్యేకహోాదా నినాదం ఉద్యమం రూపం తీసుకున్నది అనంతపురం జిల్లాలనుంచి రాహుల్ పిలుపు ఇచ్చాకే. ఇపుడు రాహుల్ ద్వారానే పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఉద్యమాన్ని మరొక అడుగు ముందుకు తీసుకువెళ్లేప్రయత్నం చేస్తున్నారు.

ఈ సందర్భంగాా పవన్ కల్యాణ్ ఒక ప్రటకన చేస్తూ రఘువీరా రెడ్డి కృషికి మద్దతు తెలిపారు.

"ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాటం చేసిన నా మద్దతు ఇస్తా. ప్రత్యేక హోదా కోసం గుంటూరు వేదికగా బహిరంగ సభ ఏర్పాటు చేసిన పీసీసీ చీఫ్ రగువీరా రెడ్డి కి నా అభినందనలు.

pic.twitter.com/HEWDpeK1z6

— Pawan Kalyan (@PawanKalyan) 4 June 2017

తక్కువ కాల వ్యవధి ఉండటం వల్ల రాలేకపోతున్న.హోదా కోసం అన్ని పార్టీలు కలిసి రావాలి. ఈ సభ విజయవంత అవ్వలి సభ ఉద్దేశ్యం రీచ్ అవ్వాలని కోరుకుంటున్న," అని పవన్ ట్వీట్ చేశారు.

 

 

ఇది ఇలా ఉంటే రాష్ట్ర డిప్యూటి ముఖ్యమంత్రి కెయి కృష్ణ మూర్తి రాహుల్ పర్యటనను తప్పు పట్టారు.

దీనికి ఆయన పేర్కొన్న కారణాలు:

1)రాహుల్ గాంధీ కి రాష్ట్రం లో  పర్యటించే హక్కు లేదు.

2)కట్టు గుడ్డలతో బయటకి పంపించి ఈ రోజు ఎలా ఉన్నారో  చూడడానికి వస్తున్నారా ?

3)ప్రత్యేక హోదా అంటూ రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ , రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఈ విషయాన్ని ఎప్పుడైనా ప్రస్తావించారా?

4)రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన కేవలం  రాజకీయ ప్రయోజనం కోసమే అని చెబుతూ . 

ప్రజలు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ని  బహిష్కరించాలని ఆయన పిలుపు నిచ్చారు.

 రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీ కి ఒప్పుకున్నారని ఆయన గుర్తు చేశారు.

 

click me!