ఎక్కడున్నావ్ సానియా... ఏడ బోతివి సానియా...

Published : Jun 03, 2017, 03:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
ఎక్కడున్నావ్ సానియా... ఏడ బోతివి సానియా...

సారాంశం

టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 2014లో తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఒక  కోటి రుపాయల చెక్ కూడా అందించారు. ఆమె నిజమయిన హైదరాబాది అని ప్రశంసించారు. అయితే, ఆమె ఎపుడూ తెలంగాణా కార్యక్రమాలలో కనిపించరు. వినిపించరు.  నిన్నజరిగిన తెలంగాణా మూడో వార్షికోత్సవంలో కూడా కనిపించలే. దీనితో ఒక అజ్ఞాత కవి   కలవరించారిలా...

ఎక్కడున్నావ్ సానియా....

మా అదృష్టమో... దురదృష్టమో...
పక్క దేశం ,
మా శతృదేశం కోడలైనా..

నిన్ను...
దేశ సామరస్యం అనే కరుణారసం మీద...
నువ్వు మా బంగారు బొమ్మవి..అని..
నా కోటి రతనాల వీణ నా బంగారు తెలంగాణ కి బ్రాండ్ ambassador ని చేసిరి మా నాయకులు....


తంగేడు పూలతో మాల చేసి నీకేద్దాం అని జూస్తే కనిపించకపోతివి...
కంటికేమో గాని..
కనీసం కనుచూపు మేరకైనా కానరాకపోతివి..

అంబరాన్నంటేలా సబ్బండ వర్గాలన్ని సంబురాలు చేస్తుంటే...
యాడికి పోతివి...సానియా

 

(ఈ కవిత సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటే పట్టేశాం)

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu