
ముఖ్యమంత్రి పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడక పోవడం ఎక్కడయిన ఉంటుందా...
కొత్తగా ఉంది కదూ... ఉత్తరప్రదేశ్ లోనే అలాంటివి జరుగుతూ ఉంటాయి.
వాడివాడిగా వేడివేడిగాజరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల రెండు ప్రధాన పార్టీలకు ముఖ్యమంత్రులు ఎవరో స్పష్టమయింది. సమాజ్ వాది పార్టీ తరఫున అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థి. అలాగే బహుజన్ సమాజ్ పార్టీకి మాయావతి తప్ప మరొకరు ముఖ్యమంత్రి. బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే, రెండు పేర్లు ఈ పార్టీ వర్గాల్లో నానుతున్నాయి. ఇందులో ఒకరు యోగి ఆదిత్యనాథ్ దాస్. ఆయన గోరఖ్ పూర్ లోకసభ సభ్యుడు. మరొకరు లక్నో లోక్ సభ సభ్యుడు రాజ్ నాధ్ సింగ్,కేంద్ర హోం మంత్రి.
రాష్ట్రీయ లోక్ దళ్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగాప్రచారమవుతున్నది మాజీ ప్రధానిచరణ్ సింగ్ మనవడు, అజిత్ సింగ్ కుమారుడు జయంత్ చౌధురి ముఖ్యమంత్రి అభ్యర్థి.
ముఖ్యమంత్రి అభ్యర్థులెవరూ ఎన్నికల బరిలేకుండా దేశంలో ఇలా ఒక ఎన్నిక జరగడం ఇదే మొదలుకావచ్చు.
జరగనున్న యూపీ ఎన్నికలు ఫిబ్రవరి 11న ప్రారంభమయి ఏడు విడతల్లో కొత్తర ప్రదేశ్ ఎన్నికలుసాగుతాయి.
ప్రస్తుతం యూపీ ముఖ్యమంత్రి అయిన అఖిలేశ్ యాదవ్ ఇపుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. మరొక ఏడాది పాటు ఆయన సభ్యత్వం ఉంది. అందుకని ఇప్పుడు ఎన్నికల బరిలో దిగాల్సిన అవసరం లేదు బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. అవసరమయినపుడు రాజ్యసభకురాజీనామా చేసి ఎమ్మెల్సీ వచ్చి ముఖ్యమంత్రి కావచ్చు. బహుశా బిజెపి సభ్యులు కూడా ఇదే దారి ఎన్నుకోవచ్చు. ఆర్ ఎల్ డి అభ్యర్థి ముఖ్యమంత్రి కావడం అంతసులభం కాదు. కాబట్టి జయంత్ పోటీ చేసినా చేయకపోయిన ఫరక్ పడదు.