'యాపిల్' దారి అమరావతి కాదు, బెంగళూరు

First Published Feb 3, 2017, 7:10 AM IST
Highlights

అంతర్జాతీయ నగరం అమరావతి పక్కనే తయారువుతున్నా యాపిల్ బెంగళూరుకు పోవడం వింత

ఇండియాలో అతిపెద్ద యాపిల్ ఐఫోన్ తయారీ యూనిట్ ను బెంగళూరు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. యాపిల్ సంస్థ ప్రతినిధులు  కర్నాటక  ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈనిర్ణయం తీసుకున్నారు.  ఇది జూన్ కల్లా తయారవుతుంది.

 

అంతర్జాతీయ నగరం అమరావతి పక్కనే తయారువుతున్నా యాపిల్ బెంగుళూరుకుపోవడం వింత.  కొన్ని వందల కంపెనీలు 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఎంవో యు చేసుకుంటున్నా యాపిల్  లెక్క చేయలేదు. బెంగళూరులోనే ఐఫోన్ తయారు చేసే అతిపెద్ద యూనిట్ ని  ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. యాపిల్ నిర్ణయాన్ని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు.

 

యాపిల్  నిర్ణయంతో  విదేశీయులు పెట్టుబడులు పెట్టేందుకు బెంగళూరు అత్యుత్తమ స్థానం అని మరొక సారి రుజువయిందని  మంత్రి వ్యాఖ్యానించారు.  దీనితో పాటు రాష్ట్ర విధానాలు విదేశీ పెట్టుబడులకు బాగా అనుకూలంగా ఉన్నాయని కూడా రుజువయిందని మంత్రి చెప్పారు.

 

యాపిల్  ఐఫోన్ ఆపరేషన్స్ వైస్ ప్రెశిడెంట్ ప్రియా బాలసుబ్రమణియన్, అలీ  ఖానాఫెర్ (హెడ్ గవర్నమెంట్ ఆపరేషన్స్), ధీరజ్ ఛుగ్ (డైరెక్టర్, ఐఫోన్ ఆపరేషన్స్), ప్రియేష్ ఫోవన్న(కంట్రీ కౌన్సెల్) ఈ చర్చల్లో పాల్గొన్నారు.



యాపిల్ కోసం బెంగుళూరులో ఐఫోన్ లను విస్ట్రాన్ అనే తైవాన్ కు చెందిన సంస్థ తయారుచేస్తుంది. విస్ట్రాన్ యాపిల్ ఐఫోన్స్కు ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మాన్యుఫ్యాక్చరర్ ( OEM).

 

యాపిల్ ను అకట్టుకోవడంలో అమరావతేకాదు, హైదరాబాద్ విజయవంతం కాలేకపోయింది.

 

 

click me!