ఈయన వీహెచ్పీలో బీకాం ఫిజిక్స్ స్వామీజీ

First Published May 22, 2017, 8:16 PM IST
Highlights

బీకాంలో ఫిజిక్స్ కేవలం రాజకీయనాయకులే చేస్తున్నారనుకుంటే పొరపాటే ఇప్పుడు స్వామిజీలు కూడా వారికి పోటీకి వస్తున్నారు.

బీకాంలో ఫిజిక్స్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదిప్పుడు. చాలా మంది రాజకీయ నాయకులు ఆ కోర్సే చేసినట్లు పబ్లిక్ గానే తెలిసిపోయింది.

 

ఇన్నాళ్లు రాజకీయ నాయకులే అనుకున్నాం ఇప్పుడు స్వామిజీలు కూడా ఇలాంటి కోర్సులే చేసినట్లు కనినిస్తున్నారు. వారి మాటలు చూస్తుంటే మీరు కూడా కచ్చితంగా అవుననే అంటారు.

 

మొన్నామధ్య బెంగళూరులో వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరం సమావేశం జరిగింది. దీనికి వీహెచ్పీ నేత స్వామి విజ్ఞానానంద కూడా హాజరయ్యారు. ఆయన వంతురాగానే భారత దేశం గురించి తెగ పొగిడేశారు. అందులో ఏ తప్పులేదు. కానీ, అలా పొగుడ్తూ పొగుడ్తూ అసలు ఇండ్రస్టీ అనే ఇంగ్లీష్ పదం మన ఇండస్ వ్యాలీ (సింధూ లోయ) వల్లే వచ్చిందని ఘంటాపథంగా చెప్పేశారు.

 

బ్రిటీష్ వాళ్లు భారత్ కు వచ్చాక ఇక్కడ ఇండస్ వ్యాలీ (సింధూ లోయ) లోని నాగరికతను చూసి ముగ్దులై ఇండస్ట్రీ అనే పదాన్ని కనిపెట్టారని తేల్చేశారు.

అయితే ఇండస్ వ్యాలీ బయటపడింది 1921 లో... బ్రిటీష్ వాళ్లు భారత్ కు వచ్చింది 1498 లో... ఇక ఇండస్ట్రీ అనే పదం ఎప్పటి నుంచో ఉంది.

click me!