
రజనీ కాంత్...
నిజంగా ఆ పేరులో ఏదో ఉంది...
బక్క పలచని శరీరం.. ఆకర్షణలేని చూపులు... కొట్టొచ్చినట్లుండే ముసలితనం...
అయినా సరే..... ఆయనలో ఏదో ఉంది... అందుకే రజనీ తారలకే తార అయిపోయాడు...
సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ఆయనను కలుసుకోడానికి తెగ ఉత్సాహపడుతుంటారు. అందులో నేను ఒకడిని అంటూ కేంద్ర మంత్ర నితిన్ గడ్కరీ తన గత స్మృతులను నెమరేసుకున్నారు.
రజనీకాంత్ కు తాను అభిమానినని చెప్పిన గడ్కరీ తాను ఎప్పుడు చెన్నై వెళ్లినా ఆయనను కలుస్తానన్నారు.
ఒకసారి ఒక ఇంజినీర్ ను తనతో పాటు రజినీ ఇంటికి తీసుకెళ్లానని రజనీ ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారని.. అప్పటి నుంచి మూడు రోజుల వరకు ఆ ఇంజినీర్ ఆ చేయితో ఏ పని చేయలేదు గుర్తు చేశారు.
దీన్ని బట్టి రజనీకి ఎంత ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయం అని తాను భావిస్తున్నట్లు చెప్పారు.బీజేపీలోకి వస్తే ఆయనకు ఉన్నతపదవి కట్టబెట్టడం గ్యారెంటీనని తెల్చిచెప్పారు.