రజనీకాంత్ రాజకీయాలకు వ్యతిరేకత మొదలు

First Published May 22, 2017, 3:12 PM IST
Highlights

సూపర్ స్టార్ అనుమానించినంత అయింది.నువ్వు రాజకీయాల్లోకి రావద్దని  ఏకంగా ఆయన  ఇంటి ముందే  తమిళ సంఘం ఒకటి ఆందోళనకు దిగింది. కె వీరలక్ష్మినాయకత్వంలోని ‘తమిళార్ మున్నేత్ర పాదై’ అనే సంస్థ ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసింది.

 సూపర్ స్టార్ అనుమానించినంత అయింది. తాను నూరు శాతం తమిళోడినే అని రజనీకాంత్ ఎంత గట్టిగా చెప్పిన తమిళ ప్రజలు వినేలా లేరు. 

 

మీరు రాష్ట్రం విడిచిపొమ్మంటే, హిమాలయాలకు పోతానుగాని మరొక రాష్ట్రంలో స్థిరపడనని ఆయన రెండురోజుల కిందట చెప్పినా అక్కడి ప్రజలు పట్టించుకోవడం లేదు.

 

నువ్వు రాజకీయాల్లోకి రావద్దని  ఏకంగా ఆయన  ఇంటి ముందే  తమిళ సంఘం ఒకటి ఆందోళనకు దిగింది. కె వీరలక్ష్మినాయకత్వంలోని ‘తమిళార్ మున్నేత్ర పాదై’ అనే సంస్థ ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటుచేసింది.ఈ సందర్భంగా సుమారు 20 మంది కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

 

దీనితో సోమవారం ఉదయం రజనీ పోయెస్ గార్డెన్ ఇంటి దగ్గిర  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 

ఫలితంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. అటు వైపు వెళ్తున్న ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. గ్రూపులుగా తిరుగుతన్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. రజనీకాంత్ పుట్టుకతో కన్నడిగుడు. సినిమాలలో ఆయన విజయవంతమయన తమిళుడిగా ఆయనను ఆమోదించలేదు.  ఇపుడు కర్నాటక , తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరీ జలవివాదాల నేపథ్యంలో ఆయన్న కన్నడ నేపథ్యం రాజకీయ వివాదమయింది.దానికి తోడు సుబ్రమణ్య స్వామి వంటి నేతలు బాహాటంగా  ఆయన రాజకీయ ప్రవేశాన్నివ్యతిరేకిస్తున్నారు. వాళ్లు చూపే కారణం, రజనీకాంత్ తమిళుడుకాదనే. 

 

ఒక వైపు తమ పార్టీలోకి రావాలని బిజెపి ఆహ్వానిస్తూ ఉంటే ఇపుడు కొన్ని తమిళ సంఘాలు ఆయన తమిళనాడు రాజకీయాలలో పాల్గొనే అర్హతే లేదంటున్నాయి.

click me!