బీర్ బార్ ప్రారంభించిన మహిళా మంత్రి

First Published May 30, 2017, 2:57 PM IST
Highlights

స్వాతి సింగ్  యోగి క్యాబినెట్ లో స్త్రీ శిశు సంక్షేం శాఖ మంత్రి. బీర్ బార్ ప్రారంభానికి , కొంత మంది అధికారులతో కలసి హాజరయ్యారు. లక్నోలో ఒక సంపన్న ప్రాంతంలో  రిబ్బన్ కట్  చేసి బీర్  బార్ ను ప్రారంభించిన తొలి మహిళా మంత్రి అయ్యారు.

 

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ మంత్రి శ్రీమతి స్వాతి సింగ్  ఏకంగా బార్ ప్రారంభం చేసి సంచలనం సృష్టించారు.ఆమె లక్నోలో ఒక సంపన్నప్రాంతమయిన గోమతీ నగర్ లో  ఒక బీర్ బార్ ను ప్రారంభించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 20 వతేదీనే ఈ ప్రారంభోత్సవం జరిగినా, ఈ పోటోలు వెల్లడయిన, సోషల్ మీడియా చేరేందుకు కొంత సమయం పట్టింది.అంతే ఇపుడు వైరల్.

 

స్వాతి సింగ్  యోగి క్యాబినెట్ లో స్త్రీ శిశు సంక్షేం శాఖ మంత్రి."బీ ద బీర్‌' అనే పేరుగల లగ్జరీ బార్‌ ప్రారంభానికి , కొంత మంది అధికారులతో కలసి హాజరయ్యారు.ఒక్కడ ఆమె రిబ్బన్ కట్  చేసి బీర్  బార్ ను ప్రారంభించిన తొలి మహిళా మంత్రి అయ్యారు.

 

స్వాతిసింగ్ ఎవరో కాదు, ఆమధ్య మాయావతిని నోటి కొచ్చినట్లు బూతులు తిట్టి పార్టీనుంచి సస్పెండయిన దయాశంకర్ భార్య.

 ఈ విషయం ఇపుడు  ముఖ్యమంత్రికి తెలిసిందని, ఆయన వెంటనే స్వాతి సింగ్ బార్ ప్రారంభోత్సవం మీద నివేదిక అడిగారని అధికార వర్గాల భోగట్టా.

 

click me!