30 కెజిల శేఖర్ రెడ్డి బంగారు అటాచ్ చేసిన ఇడి

First Published May 29, 2017, 4:30 PM IST
Highlights

మనీలాండరింగ్ చెన్నై ఘరానా, మాజీ టిటిడి బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డికి చెందిన 30 కెజిల బంగారును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు అటాచ్ చేశారు.దీని విలువ రు. 8.56 కోట్లు.

మని లాండరింగ్ చెన్నై ఘరానా శేఖర్ రెడ్డికి చెందిన 30 కెజిల బంగారును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు అటాచ్ చేశారు.దీని విలువ రు. 8.56 కోట్లు.

ఇతగాడు,గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యుడిగా ఉండేవాడు.  మొన్నామధ్య భారీగా కొత్త నోట్లు  దొరకడంతో శేఖర్ రెడ్డిని అరెస్టు చేశారు. అపుడు ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు  ఆయన బోర్టు తొలగించారు. నియమించింది కూడ ఆయనే.

గత మార్చిలో ఇడి అధికారులు రెడ్డిగారిని, ఇద్దరు అనుచరులు శ్రీనివాసులు, పి కుమార్ లతో పాటు అరెస్టు చేశారు.

పాతనోట్లకు కొత్త నోట్ల మార్పిడి స్కీం చక్కగా అమలుచేసి కోట్లు వేనకేసుకున్నాడని అధికారుల అనుమానం. ఈ బంగారంతా ఈ వ్యవహారానికి సంబంధించే అనుకుంటున్నారు. మొదటి దఫా ఇడి 34 కోట్లు అటాచ్ చేసింది.

నోట్ల రద్దు సమయంలో దేశమంతా డబ్బుల్లేక అల్లాడిపోతున్నపుడు ఇతగాడి ఇంట్లోంచి ఆదాయపు పన్ను అధికారులు  142 కోట్ల నల్లడబ్బు కనుకున్నారు. అందులో రు 34 కోట్ల కొత్త నోట్లే...

ఇన్ని కొత్త నోట్లు రెడ్డిగారికి అందించిన వారెవరో ఇంతవరకు బయటకు రావడంలేదు.

నల్లధనం నిర్మూలించేందుకు ఉద్దేశించిన నోట్ల రద్దు సమయంలో కూడా కోట్ల నల్ల ధనం వెనకేసున్నకున్న వాడు శేఖర్ రెడ్డి. ఇంత వ్యవహారం నడిపిస్తున్న రెడ్డి వెనక ఉన్న పెద్దవారెవరో భయటకు రావడం లేదు. 

 

click me!