బాబ్రి కుట్ర కేసులో అద్వానీ బృందానికి బెయిల్ మంజూరు

First Published May 30, 2017, 1:36 PM IST
Highlights

బాబ్రి మసీదు ధ్వంసం కేసులో కుట్రకోణం ఆరోపణ ఎదుర్కొంటున్న బిజెపిసీనియర్ నాయకులు ఎల్ కె అద్వానీ,మురళీ మనోహన్ జోషి, కేంద్రమంత్రి ఉమాభారతిలకు బెయిలు దొరికింది.

బాబ్రి మసీదుధ్వంసం కేసులో కుట్రకోణం ఆరోపణ ఎదుర్కొంటున్న బిజెపిసీనియర్ నాయకులు ఎల్ కె అద్వానీ,మురళీ మనోహన్ జోషి, కేంద్రమంత్రి ఉమాభారతిలతో సహా మొత్తం 12 మందికి బెయిలు దొరికింది.

 ఈ రోజు కోర్టుకు హాజరయిన వారిలో  యుపి బిజెపి నాయకుడు వినయ్ కతియార్, విశ్వహిందూపరిషత్ కు చెందిన విష్ణు హరి దాల్మియా, సాద్వి రితంబరలు కూడా ఉన్నారు.

వీరంతా వ్యక్తిగతంగా  కోర్టుకు హాజరుకావలసిందేనని సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి  ఎస్ కె యాదవ్  మే 26 న అదేశించడంతో వారు కోర్టుకు హాజరయ్యారు.

బాబ్రి మసీద్ ధ్వంసం చేయడానికి సంబంధించిన కుట్రకేసు లో వీరందరి మీద విచారణ జరిపించాల్సిందేనని సుప్రీంకోర్టు ఏప్రిల్ 19 న తీర్పు నిచ్చినసంగతి తెలిసిందే.

ఈ కేసు విచారణను రెండేళ్ల పూర్తి చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ రోజు వారందరికి రు.50 వేల పూచికత్తుతో లక్నోలోని సిబిఐ కోర్టు బెయిలు మంజూరు చేసింది.

 





 

click me!