నరసరావుపేటలో ప్లాస్టిక్‌ బియ్యం కలకలం

First Published Jun 7, 2017, 1:59 PM IST
Highlights

ప్లాస్టిక్ రైస్ కొనుగొన్నానుకున్నఒక వ్యక్తి అత్యుత్సాహం ఈ వూర్లో కలకలం సృష్టించింది. అధికారులను పరుగులు పెట్టించింది.
మూడు గంటల పాటు అధికారులు శ్రమించారు. ఫుడ్ ఇన్స్ పెక్టర్ ఉన్న ఫలానా రప్పించారు. చివరకు అంతా ఉత్తదే నని తెల్చారు.

ప్లాస్టిక్ రైస్ కొనుగొన్నానుకున్న ఒక  వ్యక్తి అత్యుత్సాహం ఈ వూర్లో కలకలం సృష్టించింది.  అధికారులను పరుగులు పెట్టించింది.
మూడు గంటల పాటు శ్రమించిన అధికారులు చివరకు అంతా ఉత్తదే నని తెల్చారు.

నిన్నటి నుంచి వస్తున్న  ప్లాస్టిక్‌ బియ్యం విక్రయిస్తున్నారనే వదంతుల మధ్య  గుంటూరు జిల్లా నర్సరావుపేటలో  ఒక వ్యక్తి అత్యుత్సాహం ప్రదర్శించాడు. తనకు ప్లాస్టిక్ బియ్యం  అమ్ముతున్న సమాచారం తెలుసని  మీడియాకు సమాచారం ఇచ్చారు.

మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని  రెవెన్యూ అధికారులకు అందించారు. రంగంలోకి దిగిన అధికారులు  మూడు గంటలపాటు శ్రమించారు.

చివరకు ఫుడ్‌ఇనస్పెక్టర్‌ నిర్ధారణలో అవి వదంతులేనిని తేలింది.  ఇటు అధికారులు, అటు ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

ఆ వివరాలు...


గుంటూరు, నర్సరావుపేట పట్టణంలోని కాకతీయ నగర్‌కు చెందిన వై.నాగేశ్వరరావు రామిరెడ్డిపేటలోని ఓ సూపర్‌ మార్కెట్‌లో 25 కేజీల బియ్యం బస్తాను కొనుగోలు చేశాడు. మంగళవారం తాను భోజనం చేస్తుండగా ఓ చానల్‌లో ప్లాస్టిక్‌ బియ్యంపై కార్యక్రమం ప్రసారమవుతోంది. ఇది గమనించి తాను వాడుతున్నది ప్లాస్టిక్‌ బియ్యమేననే అనుమానంతో స్థానిక మీడియా వారికి సమాచారం అందించారు. వారు, రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు సమాచారం ఇవ్వగా అధికారులు ఆయన చెప్పిన స్థలానికి పరుగు పెట్టారు. 

 ప్రాథమికంగా తనిఖీ చేసి  నిర్ధారణకు వచ్చేందుకు  ఆహార తనిఖీ అధికారి శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఆయన నరసరావుపేటకు వచ్చి, పరీక్షలు చేశారు. అవి ప్లాస్టిక్‌ బియ్యం కాదని నిర్ధారణ చేశారు. అయితే, ఇంకా మెరుగైన నివేదిక కోసం లేబొరేటరీకి పంపుతున్నట్టు తెలిపారు. ఆ మేరకు అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీలను డీఎస్పీ కే నాగేశ్వరరావు, ఆర్డీవో గంధం రవీందర్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఈ తనిఖీల్లో సీఐలు వీరయ్య చౌదరి, బి. ప్రభాకర్‌, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్‌ కుటుంబరావు, ఆర్‌ఐ.అంకారావు, పోలీసు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
 

click me!