విశాఖను పూర్తి క్యాష్ లెస్ సిటీగా మారుస్తాం- లోకేశ్

First Published Jun 7, 2017, 12:07 PM IST
Highlights

విశాఖపట్నం ను క్యాష్ లెస్ సిటీ గా మార్చేందుకు ప్రభుత్వం ముందు ఉంటుంది.ప్రభుత్వ కార్యాలయాలు,ఆర్టీసీ,ఇలా అన్ని చోట్లా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తాం. నగదు రహిత లావాదేవీలు చేసే ప్రజలకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తాం.

ఆంధ్రప్రదేశ్ లో  విశాఖపట్టణం మొదటి సంపూర్ణ నగదు రహిత లావాదేవీల నగరంగా మార్చేందుకు  ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.

 ఈ విషయాన్ని ఐటి మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. 

 ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ  విశాఖను ఈ విషయంలో  స్వీడెన్ స్థాయికి తెస్తామన్నారు. 

నారా లోకేశ్ చెప్పిన ఇతర విశేషాలు: 

ఇతర దేశాల్లో క్యాష్ వాడకం చాలా తక్కువ ఉంది స్వీడన్ లాంటి దేశంలో కేవలం 13 శాతం నగదు మాత్రమే వాడుతున్నారు...

విశాఖపట్నం ను క్యాష్ లెస్ సిటీ గా మార్చేందుకు ప్రభుత్వం ముందు ఉంటుంది.ప్రభుత్వ కార్యాలయాలు,ఆర్టీసీ,ఇలా అన్ని చోట్లా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తాం...

నగదు రహిత లావాదేవీలు చేసే ప్రజలకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తాం...

తెలుగుదేశం పార్టీ పెద్ద నోట్లకు వ్యతిరేకం. 500,2000 రూపాయల నోట్లను రద్దు చెయ్యాలి అనే డిమాండ్ కు కట్టుబడి ఉన్నాం.పెద్ద నోట్లు రద్దు అయితే అవినీతి తగ్గి ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి...

త్వరలో ఫైబర్ గ్రిడ్ కార్యక్రమాన్ని విశాఖపట్నం లో నూటికి నూరు శాతం పూర్తి చేస్తాం...

బలవంతంగా క్యాష్ లెస్ కార్యక్రమాన్ని ప్రజల పై రుద్దే ఆలోచన ప్రభుత్వానికి లేదు.కేవలం అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.

క్యాష్ లెస్ నగరంగా విశాఖపట్నంను మార్చేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను క్షేత్ర స్థాయి లో తెలుసుకుంటాం...

 

click me!