3 రోజుల పాటు తిరుమల కాలినడక భక్తుల టోకెన్లు రద్దు

Published : Jul 14, 2017, 12:41 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
3 రోజుల పాటు తిరుమల కాలినడక భక్తుల టోకెన్లు రద్దు

సారాంశం

జూలై 14, 15, 16 తేదిలలో దివ్యదర్శనం టోకెన్లు రద్దు వారాంతపు రద్దీ రీత్యా ఈ నిర్ణయం  మళ్లీ సోమవారం టోకెన్ల పునరద్ధరణ

జూలై 14, 15, 16 తేదిలలో దివ్యదర్శనం టోకెన్లు  జారీ చేయడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.తిరుమలలో వారాంతం రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో జూలై 14, 15, 16 తేదిలలో (శుక్రవారం, శనివారం, ఆదివారం) దివ్యదర్శనం(కాలినడకన తిరుమచేరుకునే భక్తులు) టోకెన్లు జారీ చేయడంలేదని టిటిడి ప్రకటించింది. 

కాగా 17వ తేది సోమవారం నుంచి దివ్యదర్శనం టోకెన్లు భక్తులకు మళ్లీ అందుబాటులోకి వస్తాయి. సోమవారం నుంచి రోజుకు 20 వేల టోకెన్ల చొప్పున, స్లాట్‌ పద్దతి ద్వారా జారీ చేయనున్నారు.దివ్యదర్శనం టోకన్లు కలిగిన భక్తులకు సుమారు రెండున్నర గంటల వ్యవధిలో దర్శనం అయ్యే అవకాశం ఉంది.

 కాలినడకన వస్తున్న భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని టిటిడి కోరుతోంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !