చంద్రబాబు ప్రభుత్వం చేసిన పుష్కర గాయానికి రెండేళ్లు

First Published Jul 14, 2017, 8:49 AM IST
Highlights
  • రాజమండ్రి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోయి నేటికి రెండేళ్లు
  • ముఖ్యమంత్రి చంద్రబాబు పూజ షూటింగ్ కోసం ఘాట్ ను మూసేయడమే తొక్కిసలాటకు కారణమని ప్రతిపక్షాల అరోపణ
  • విచారణకు జస్టిస్ సోమయాజులు కమిషన్ ని అరునెలల గడువుతో నియమించారు
  • కమిషన్ విచారణ ఏమయిందో ఎవరికీ తెలియదు

 

రాజమహేంద్రవరం దగ్గిర గోదావరి మహా పుష్కరాల్లో తొక్కిసలాట సరిగ్గా ఈ రోజుకు సరిగ్గా రెండేళ్లు. 2015 జూలై 14 గోదావరి నది మహా పుష్కరాలు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగి 29 మంది భక్తులు నలిగి చనిపోయారు. ఈ విషయం చనిపోయినవారి  కుటుంబ సభ్యులకు తప్పమరొకరికి గుర్తు ఉండదు. దీనికి కారణమెవరో అందరికీ తెలుసు.కారణమయిన వ్యక్తులు ఈ దుర్ఘటన జీవితలో మళ్లీ గుర్తుకు రాకుండా ఉండేందుకు ఇతరత్రాబిజీ అయిపోయారు. ఏమయితేనేం, ప్రభుత్వానికి ఉన్న పబ్లిసిటి యావ, పండగలుపబ్బాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు చేసిన ప్రయత్నాల వల్ల  29 మంది ప్రాణాలు పోయాయి. కొన్ని కుటుంబాలకు అండపోయింది. పుట్టెడు దు:ఖంతో ఈ కుటుంబాల సభ్యులు ఇళ్లకు వెళ్లిపోయారు.

రాజకీయాలకు పనికొచ్చే  నాయకులకు నివాళులర్పించేందుకు తేదీలను కచ్చితంగా పాటించే ప్రభువులకు  జూలై 14, 2015 గుర్తుండకపోవడం విచారకరం. ముఖ్యమంత్రి చంద్రబాబు మర్చిపోయినట్లు నటించినా, అక్కడేమీ జరగలేదు అని, తొక్కిసలాట చావులకు  ముఖ్యమంత్రి పూజ షూటింగ్ కు సంబంధంలేదని అధికారులు బుకాయించినా పుష్కర విషాదం తెలుగుదేశం ప్రభుత్వం  మాయని మచ్చ అని మరవరాదు.

ఈ ఘటనపై విచారించాలని రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు కమిషన్‌ను  ప్రభుత్వం నియమించింది. ఆరు నెలల్లోగా ఈ ఘటనపై బహిరంగ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కోరింది. ఈ కమిషన్ గడువు మూడేసి నెలల చొప్పున ఇప్పటికీ ఆరుసార్లు  పెంచారు. అయితే, ఇప్పటికీ ఈ కమిషన్ విచారణ పూర్తి కాలేదు, నివేదిక పూర్తి రాలేదు,దోషులెవరో వెల్లడి కాలేదు. దీన్నేమనాలి.  ఈ దుర్ఘటన మీద విచారణ చేసే శక్తి కమిషన్ కు లేదా, లేక ఆ 29 చావులు విచారణకు అందనంత లోతయినవ్యవహారమా.లేక ప్రభుత్వమే... విచారణను నత్తనడక నడిపిస్తున్నదా? అన్నీ అనుమానాలే.

 అసలు కమిషన్ విచారణ మొదలుపెట్టిందే ఆరు నెలలు గడువులో సగం పూర్తయ్యాక.

ఆపైన చాలాకాలంపాటు అధికార యంత్రాంగం తమ సాక్షాలను కమిషన్ ముందు పెట్టడంలో కావాలనే జాప్యం చేసిందని చెబుతారు. ఎందుకంటే ప్రధాన అరోపణ వచ్చింది  ముఖ్యమంత్రి చంద్రబాబు మీదే. ఆంధ్రప్రదేశ్ ను తాను ఎక్కడికో తీసుకుపోతున్నాననిచెప్పేందుకు ఒక డాక్యుమెంటరీ షూట్ చేసేందుకు కెమెరా కోసం పూజ చేయాలనుకోవడం  తొక్కిసలాట కు దారి తీసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీని వల్లే అధికార యంత్రాంగం కావాలనే తమ సాక్షాలను కమిషన్ ముందు పెట్టడం లేదని బాధితుల తరపు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు చాలా కాలం వాదిస్తూనే వచ్చారు చివరకు సాక్షాధారాలు కమిషన్‌కు అధికార యంత్రాంగం సమర్పించినప్పటికీ తుది విచారణ జరిగేలోపు కమిషన్ విచారణ గడువు గత మార్చి 29వ తేదీన ముగిసింది. దీనితో తర్వాతి విచారణ ేమయిందో ఎవరికీ తెలియడం లేదు.

జూలై 14, 2015 తొక్కిసలాట 29 మంది భక్తులు మృతి చెందారు. మరొక  51 మంది గాయపడ్డారు. కమిషన్ 2015 సెప్టెంబర్ 15న బాధ్యతలు చేపట్టింది. 2016 జనవరి 18న తొలి విచారణ చేపట్టింది.

click me!