నంద్యాలకు చంద్రబాబు కనివిని ఎరుగని బంపర్ ఆఫర్

First Published Jul 13, 2017, 7:06 PM IST
Highlights
  • భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యే బతుకున్నంతవరకు ఏమీ జరగలేదు
  • భూమా నాగిరెడ్డి చనిపోయి ఉప ఎన్నిక రాగానే కోట్లు కోట్లు కుమ్మరిస్తున్నారు
  •  నంద్యాలలో రూ.800కోట్లతో ఇళ్ల నిర్మాణం, కొద్ది సేపటి కిందట ప్రకటన

ఒక్క నంద్యాల నియోజకవర్గంలోనే రూ.800కోట్లతో పక్కగృహాలను పేదలకు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు  ప్రకటించారు.ఈ పని మొదలయిందని కూడా చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో ‘ఎన్టీఆర్ నగర్’ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, పక్కా ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. గురువారం తన నివాసం నుంచి పట్టణాలలో ఇళ్ల నిర్మాణంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నంద్యాల 800 కోట్ల బంపర్ ఆఫర్ ‘ఎన్టీఆర్ నగర్’ ప్రకటించారు. పట్టణంలో ఈ ఇళ్ల కోసం 3 చోట్ల కేటాయించిన 120 ఎకరాల భూమి విలువే రూ.250 కోట్లు ఉంటుందన్నారు. లబ్దిదారులకు ఇచ్చే సబ్సిడీ విలువ రూ.400 కోట్లు ఉంటుందని, ఆప్రాంతాలలో  ప్రభుత్వం నిర్మించే రోడ్లు, తాగునీరు, విద్యుత్, పార్కుల అభివృద్ది, ఇతర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ విలువ రూ.150 కోట్లు పైబడి ఉంటుందని చెప్పారు.

అదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోని పట్టణ ప్రాంతాలలో భారీఎత్తున ఎన్టీఆర్ నగర్ ల అభివృద్ది,  పక్కా ఇళ్ల నిర్మాణాన్ని ఈ రెండేళ్లలో శరవేగంతో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం  చేశారు.ఈ టెలికాన్ఫరెన్స్ లో అర్భన్ హవుసింగ్ శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ, మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఇతర మంత్రులు, పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి కరికాల వలవన్,  జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ ఛైర్మన్లు పాల్గొన్నారు. 

click me!