యువత బంగారు కలలపై దెబ్బ

Published : Jan 30, 2017, 09:46 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
యువత బంగారు కలలపై దెబ్బ

సారాంశం

యువత బంగారు కలలపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద దెబ్బే కొట్టబోతున్నాడు.

అమెరికాకు వెళ్ళాలనేది తెలుగు యువతకు ఓ బంగారు కల. చదువుకోవటానికి కావచ్చు, ఉద్యోగార్ధం కావచ్చు. మొత్తం మీద అమెరికాకు వెళ్లటమే జీవిత పరమార్ధంగా అనుకునే తెలుగు యువత లక్షల్లో ఉంటుంది. అటువంటి యువత బంగారు కలలపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద దెబ్బే కొట్టబోతున్నాడు. ఏడు దేశాలకు చెందిన ముస్లిం దేశస్తులపై తన ప్రతాపాన్ని చూపుతున్న ట్రంప్ తదుపరి లక్ష్యం మనదేశమేనని స్పష్టమవుతోంది.

 

ప్రపంచదేశాల్లోకెల్లా ప్రతీ ఏడాది అమెరికాకు వెళ్ళే యువతలో మన దేశందే అగ్రస్ధానం అని చెప్పవచ్చు. అలాగే దేశం మొత్తం మీద పంజాబ్, గుజరాత్ తర్వాత మూడోస్ధానం తెలుగువాళ్ళదే. పాఠశాల విద్యార్ధిదశలో ఉన్నపుడు తల్లిదండ్రులు తమ పిల్లలకు అమెరికాకు వెళ్ళి చదువుకోవాలని, పెద్ద ఉద్యోగాలు చేయాలని నూరిపోస్తుంటారు. అదే మాటలు మనసులో నాటుకుపోయి యువత చదువైపోగానే అమెరికాకు వెళ్లటమే లక్ష్యంగా పెట్టుంటుంది.

 

మొన్నటి వరకూ పరిస్ధితులు సజావుగానే సాగాయి. అయితే, ఎప్పుడైతే ట్రంప్ అధ్యక్ష్య ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారో మన యువత గుండెల్లో గుబులు మొదలైంది. ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత గుబులు కాస్త నిజమైకూర్చుంది. అసలు అమెరికాకు వెళ్ళకపోతే జీవితమే వృధా అనుకునే యువత లక్షల్లోనే ఉంటారు. అటువంటి వారికి ఇపుడు ఇబ్బందే. ప్రస్తుతం 7 ముస్లిం దేశాలపై దృష్టి సారించిన ట్రంప్ తదుపరి లక్ష్యం మనదేశమే అనే ప్రచారం బాగా జరుగుతోంది. దాంతో అమెరికా వెళ్లాలనుకునే యువతలో ఆందోళన బయలుదేరింది. అంతేకాకుండా ఇటీవలే అమెరికా వెళ్ళిన తెలుగు వాళ్ళ కూడా తిరిగి వచ్చేయక తప్పదా అన్న ఆలోచనే యువతను కలవరపెడుతోంది. లక్షలాది మంది యువత కలల భవిష్యత్తు ట్రంప్ చేతిలో ఉంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !