షోకు, ఠీకు, టాకు నాయకులతో ప్రమాదం

First Published Jan 29, 2017, 4:03 AM IST
Highlights

మహాత్మాగాంధీ మాత్రమే అసలైన నాయకుడు. ఆయన అనుచరులంతా ఉద్ధండులు, సమానులు.  ఒక్కరు కూడా భజన పరుడు కాదు

ఆధునిక భారత దేశ చరిత్రలో అసలయిన నాయకుడు మహాత్మాగాంధీయే నని ప్రఖ్యాత జర్నలిస్టు, వాజ్ పేయి ప్రభుత్వంలో డిసిన్వెస్టెమెంటు మంత్రిగా పనిచేసిన అరుణ్ శౌరి చెప్పారు.

 

 ఆయన నాయకుడిగా నిలచిపోయింది చుట్టూ ఉన్న భజన పరుల వల్ల కాదు. " ఆ రోజు ల్లో మహాత్మాగాంధీ చుట్టూర ఉద్ధండులయిన నాయకులుండే వారు. వాళ్లెవరు రెండో వరస వాళ్లు కాదు. సమానులు," అని ఆయన చెప్పారు.

 


హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ లో ‘లీడర్స్ అండ్ ఫాలోయర్స్’ అనే అంశం మాట్లాడుతూ ఇప్పుడు రాజ్యమేలుతున్న నాయకుల లక్షణాలుగురించి, వారి అనుచరుల గురించి  ఆయన చక్కగా చెప్పారు ట్లాడారు. అయన మనసులో మోదీ చిత్రమే ఉన్నా, మనకు చాలా మంది నాయకులు, వాళ్ల చుట్టూ ఉన్న భజన సంఘాల వాళ్లు కళ్లలో కనబడతారు. 

 

 శౌరి ఇంకా ఏమన్నారో చూడండి.

 

మరొక చురక వేస్తూ...  ఈ మధ్య నాయకులు బాగా సింగారించుకుని, తమని తాము చూసుకుని మురిసిపోతు ( narcissistic and charming), తెలివి మీరి మాట్లాడుతూ  నెగ్గుకొస్తున్నారని చెబుతూ ఇది బలహీనతను కప్పిపుచ్చుకునే వ్యూహం అని అన్నారు. వాళ్ల అనుచరులు కూడా ఈ రోగ లక్షణాలను, సుగుణాలుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు.

 

అతితెలివి గా మాట్లాడి చప్పట్లు కొట్టించుకుని నాయకడనిపించుకోవాలని అనుకుంటున్నారని ఆయన హెచ్చరించారు.


మోదీ, ఇందిరాగాంధీలకు సారూప్యం ఉందని అంటూ ఇందిరాగాంధీ అంతరంగీకులెలాంటి వారో  ఆయన వివరించారు. అంటే దానర్థం మోదీ అంతరంగీకులు ఎలా ఉన్నారో  చూడండనే అర్థం.


"ఇందిరా గాంధీ అంతరంగీకుడు కావాలంటే నాలుగు లక్షణాలుండాలి: ఏ సత్తా లేని వాళ్లు (weak persons),అమ్ముడు పోయేవాళ్ల (compromised), చంచాగాళ్లు (henchmen), (పదవులకోసం) సొంగ కార్చుకునే (salivating men)," అని చెబుతూ మహాత్మాగాంధీ ఒక్కడే నిజమయిన నాయకుడని అన్నారు.

 


ఎందుకంటే , ఆయన చుట్టూ ఉన్నవాళ్లెవరే సెకండ్ రేట్ భజన సంఘమోళ్లు కాదు,సమాన శక్తి ఉన్న వాళ్లు అని చెప్పారు.

 


మోదీ పేరెత్త కుండా ఆయన నోట్ల రద్దు గురించి చెప్పారు. అయితే, తానిపుడు ప్రస్తుత రాజకీయ నాయకుల గురించి మాట్లాడటం లేదనగానే హాళ్లంతా భళ్లున నవ్వింది.
నల్లడబ్బును ఇంట్లో పెట్టెల్లో దాచుకుంటారా ఈరోజుల్లో అని ఆయన ప్రశ్నించారు.

 


ఇలా దాచుకున్నవాడు, ఒక్కడే... 25 సంవత్సరాల కిందట సుఖ్ రామ్.  ఆ తర్వాత ఎవరూ కనిపించలేదు. 
నల్లడబ్బు కాగితపు నోట్లలోనే లేనపుడు, నోట్లరద్దు చేసి నల్ల ధనం నిర్మూలిస్తానని మోదీ అనడం వింత అన్నారు . 

 

"నల్లధనం అనే డెంగీ దోమ స్విట్జర్లాండ్‌ మీదుగా వెళుతుంటే, మీరు ఇక్కడ దాన్ని బంధించాలని అనుకుంటున్నారు,"అంటూ ఎద్దేవా చేశారు. 
ఇపుడు అనుచరులు.. నాయకులకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారన్నారు. నాయకులు ప్రకటించే పథకాలపై అవగాహన లేకున్నా వారి మెప్పు పొందేందుకు పథకాలపై అనుచరులు విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారన్నారు. 

 

ప్రజలకొకసలహా ఇచ్చారు.   "పరిపాలన పనికిరాదని భావించిన వెంటనే సహకరించడం మానుకోండి. దాన్నుంచి తప్పుకోండి," అని అన్నారు.

click me!