ఒకే పద్దతిలో సాగుతున్నారు

First Published Jan 30, 2017, 2:03 AM IST
Highlights

ప్రతిపక్షాలను గానీ, మిడియాను గానీ ఏమాత్రం సహించలేకున్నారు. తాము ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు తమను ప్రశ్నించకూడదు. ఎవరికీ తాము సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదన్న ధోరణే ఎక్కువ కనబడుతోంది.

నరేంద్రమోడి, చంద్రబాబునాయుడు తీరు ఒకే విధంగా ఉన్నది. తమ విధానాలను ప్రశ్నించిన వారిని జాతివ్యతిరేకులుగాను, అభివృద్ధి వ్యతిరేకులుగాను ధూషిస్తున్నారు. మీడియా, ప్రతిపక్షాలు, ప్రజలు ఎవ్వరూ తమను ప్రశ్నించటాన్ని వీరు సహించటంలేదు. సిఎంగా ఉన్నపుడు మోడి, ప్రతిపక్షంలో ఉన్నపుడు చంద్రబాబు తాము ఏమి చేసారన్న విషయాన్ని గురువింద గుంజ పద్దతిలో వీరిద్దరూ మరచిపోయినట్లున్నారు. మోడి అయిన చంద్రబాబైనా పీఠాలెక్కిన దగ్గర నుండి ఒకటే పద్దతి పాటిస్తున్నారు. తాము ఏమనుకుంటే అదే చేస్తున్నారు.

 

ప్రతిపక్షాలకు గానీ, మిడియాను గానీ ఏమాత్రం సహించలేకున్నారు. తాము ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు తమను ప్రశ్నించకూడదు. ఎవరికీ తాము సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదన్న ధోరణే ఎక్కువ కనబడుతోంది. దేశం మొత్తాన్ని అతలాకుతలం చేసిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో తన వైఫల్యంపై మొడి ప్రజలకు సమాధానం చెప్పుకోలేదు. ప్రతిపక్షాలను లెక్కే చేయలేదు. పార్లమెంట్ లో ఒక్కమాట కూడా మాట్లాడకపోవటమే మోడి నిరంకుశ ధోరణికి ఒక ఉదాహరణ.

 

ఇక, చంద్రబాబైతే తన దావోస్ పర్యటనపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వచ్చిందని మండిపడ్డారు. విమర్శించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. అదేవిధంగా పెట్టుబడుల కోసం జరిపిన భాగస్వామ్య సదస్సులో ప్రశ్నలడిగిన విలేకరిని తన ఇష్టం వచ్చినట్లు తూలనాడారు. పోయిన సదస్సులో చేసుకున్న ఎంఓయులనే ఇపుడు చేసుకున్నట్లుగా చూపిన విషయాన్ని ప్రశ్నిస్తే మండిపడ్డారు. ఇక, రాజధాని నిర్మాణం గురించి అడగకూదు, రైతుల పక్షాన మాట్లాడకూడదు. అభివృద్ధి పనుల్లో జరిగుతున్న అవకతవకలను ప్రస్తావించకూడదు.

 

అధికార మత్తు ఇద్దరికీ బాగా తలకెక్కినట్లే ఉంది. మోడి విధానాలను ప్రశ్నిస్తే జాతి వ్యతిరేకులట. చంద్రబాబును ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధకులుగా ముద్రవేస్తున్నారు. ఇదే మోడి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, చంద్రబాబులు ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికార కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన అందరికీ తెలిసిందే. చంద్రబాబైతే మీడియా సమావేశాలు లేకుండా ఒక్క రోజు కూడా గడపలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాయాల్సిందిగా చంద్రబాబు ఒకవర్గం మీడియాను బాగా ప్రోత్సహించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రభుత్వ విధానాలపై అప్పట్లో ప్రతిపక్షాలను కలుపుకుని ఆందోళనలు చేసిన సంగతిని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. ఇద్దరు కూడా మనది ప్రజాస్వామ్యదేశమన్న సంగతి పూర్తిగా మరచిపోయినట్లున్నారు. వ్యవస్ధలను భయపెట్టి ఎంత కాలం పాలన సాగిస్తారో చూడాలి.

click me!