
విజయవాడ ఎంపి కేశినేని ప్రయివేటు బస్సులరద్దు మీద చేసిన వ్యాఖ్యలతో టిడిపి ప్రభుత్వం ఇరుకున పడింది. దీనిమీద రవాణా మంత్రి అచ్చన్నాయుడు ఇలా సమాధానం మిచ్చారు.
కేశినేని నాని తప్పు మాట్లాడలేదు.. అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ట్రావెల్స్ అన్నీ కూడా ఎవ్రీ డే ఆ రాష్ట్రానికి వెళ్లి అక్కడి నుంచి ట్రావెల్ చేయవలసినటువంటి అవసరం చట్టంలో ఉంది.. సుమారు 900 బస్సులు అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నేషనల్ పర్మిట్లు ఇష్యూ చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది. దాని వల్ల ఇక్కడ రిజిస్ట్రేషన్లు చేసి తిప్పడం జరుగుతోంది.. అరుణాచల్ ప్రదేశ్ లో 2500 స్లీపర్ కోచ్ బస్సుల రిజిస్ట్రేషన్లన్నీ రద్దు చేశామని వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన 900 బస్సుల రిజిస్ట్రేసన్లు కూడా రద్దు చేశామని వస్తే.. నేను వెంటనే ఎంక్వైరీ చెయ్యమని అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చాను.. ఏదో వాట్సాప్ మెసేజ్ వచ్చినంత మాత్రాన మనం అమలు చేయలేం.. వెంటనే వాళ్లకి ఒక లేఖ రాసి మా కమీషనర్ ట్రాన్స్ పోర్టు, అరుణాచల్ ప్రదేశ్ ట్రాన్స్ పోర్టు కమిషనర్ తో మాట్లాడాము.. మీరు వెహికల్ వారీగా, నెంబర్ వారీగా ఎన్ని వెహికల్స్ మీరు రద్దు చేశారు.. ఆ వివరాలన్నీ మీరు ఇస్తే వెంటనే యాక్షన్ తీసుకోవడానికి అవకాశముంటుందని చెప్పి లేఖ రాశాం.. దీనిపై ఇవాళో రేపో సమాధానం వస్తే దానిపై యాక్షన్ తీసుకోవడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు.
900 బస్సులు మనం రాత్రికి రాత్రే రద్దు చేస్తే దాని మీద కొన్ని వేల మంది ప్రయాణం చేస్తున్నారు.. స్లీపర్ కోచ్ లన్నీ కూడా ప్రైవేట్ బస్సుల్లోనే ఉన్నాయి.. దాని వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారని నేను వెంటనే మా ఆర్టీసీ ఎండీకి ఆదేశాలిచ్చాను.. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణీకులు వెళుతున్నారు, రోజుకి ఎంతమంది వెళుతున్నారు.. దానికి మనం ఆల్టర్నేటివ్ గా ఒక బస్సు తీసేస్తే ఆర్టీసీ తరపున ఒక బస్సు వెయ్యగలమా, ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యగలమా అనేది అన్వేషించమని చెప్పాను..
కేశినేని నాని మాట్లాడిన మాటలను నేను తప్పపట్టడం లేదు. అది ఆయన వ్యక్తిగతం, ట్రావెల్స్ రద్దు చేశారంటే ఆయన వ్యక్తగతమే.. నిన్న కూడా నేను అదే మాట్లాడాను. లేకపోతే ఆయన ఇక్కడున్నటువంటి లోపాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కూడా ప్రజాప్రతినిధిగా ఆయన బాధ్యత.. ఆయన చెప్పింది.. మనం అమలు చేస్తుందీ ఒక్కటే కాబట్టి ఒకేసారి చేస్తే దాని యొక్క పరిణామాలు ప్రజల మీద, ప్రయాణీకుల మీద పడతాయి.. కాబట్టి మనం చట్టానికి అనుగుణంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం ప్రభుత్వం యొక్క ముఖ్యఉద్ధేశం.
తప్పుదోవపట్టించడానికి మేమేమీ అమాయకులం కాదు.. చట్టం తెలుసు.. ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎవ్రీడే ఆబస్సు ఆ రాష్ట్రానికి వెళ్లాలి. అయితే రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి నడుపుతున్నారు. ఈమధ్య కాలంలో చట్టానికి అనుగుణంగా వెళుతున్నాము తప్ప వ్యతిరేకంగా వెళ్లడం లేదు, ఆ అవసరం ప్రభుత్వానికి కూడా లేదు. నిబంధనలకు వ్యతిరేకంగా తిరిగే ప్రైవేటు బస్సులపై ఎప్పటికప్పుడు ఎంక్వైరీలు చేయడం, చెకింగ్ లు చేయడం జరుగుతున్నాయి. చట్టానికి వ్యతిరేకంగా వెళ్లినటువంటి ఏ బస్సుమీదకానీ, ఏ వెహికల్ నుకానీ ఉపేక్షించే సమస్యలేదు.