
ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్-విజయవాడ మధ్య 26 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు.
సికింద్రాబాద్-విజయవాడ స్పెషల్ (రైల్ నెంబర్: 07757) సికింద్రాబాద్ నుంచి జూలై 2, 9, 16, 23, 30, ఆగస్టు 6, 13, 20, 27, సెప్టెంబర్ 3, 10, 17, 24వ తేదీల్లో ఉదయం 5.30 గంటలకు బయల్దేరి, అదే రోజు ఉదయం 10.45 గంటలకు విజయవాడ చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో విజయవాడ-సికింద్రాబాద్ స్పెషల్ (రైల్ నెంబర్: 07758) విజయవాడ నుంచి జూలై 2, 9, 16, 23, 30, ఆగస్టు 6, 13, 20, 27, సెప్టెంబర్ 3, 10, 17, 24వ తేదీల్లో సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి, రాత్రి 10.50 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
ఈ ప్రత్యేక రైళ్లన్నీ ప్రత్యేక చార్జీలతో నడుస్తాయి.