
ఒపెనర్ అనే చిన్న ఇనప ముక్క లేకపోతే బీర్ బాాటిల్ని వొపెన్ చేయడానికి నానా కష్టాలు పడాలి. కొంతమంది బీర్బలురు బీర్ సీసా ఒపెన్ చేసే మార్గాలెన్నింటినో కనిపెట్టారు. ఏకంగా పళ్లతో మూతని లాగించిపడేయడం ఒక పద్ధతి. కీచెయిన్లను,తలపు బోల్టులను కూడా ఒపెనర్ గావాడుతూ పెనుగులాడటం మరొక పద్ధతి. అయితే, ఇదిగో ఇతగాడు ఏకంగా ఒక పీత చేత బీర్ బాటిల్ ఒపెన్ చేయించాడు ఇలా. పీత కొండిలు పదునే కాదు, చాలా శక్తి వంతమయినవి కూడా. సీసానే కాదు బీర్ క్యాన్ ని కూడా కొండితో కసక్కున కొరికి రంధ్రమేసిందొక పీత.