ఈవీఎంలను  ఇలా టాంపరింగ్  చేయోచ్చట!

First Published May 9, 2017, 1:04 PM IST
Highlights

ఎమ్మెల్యే సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ గా పనిచేశారు. ప్రజాప్రతినిధికాకముందు ఆయనకు ఇంజనీర్ గా పదేళ్ల అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే ఆయన ఈవీఎంలను ఎలా టాంపరింగ్ చేయోచ్చు డెమో ఇచ్చారు.

ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎం) టాంపరింగ్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది.ముఖ్యంగా ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వాన్ని ఈవీఎం టాంపరింగ్ పేరుతో ఇరుకనపెట్టే ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నారు.

 

ఇందులో భాగంగా ఆయన ఈ రోజు ఢిల్లీ అసెంబ్లీ సాక్షిగా ఓ సంచలనాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.రిగ్గింగ్ చేసే ఉత్తర ప్రదేశ్, ఉత్త‌రాఖండ్‌తో పాటు ఢిల్లీ స్థానిక ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిచింద‌ని అందుకే ఇదే సాక్షం అంటూ అసెంబ్లీలో ఈవీఎంల టాంరింగ్ ను చూపెట్టారు.

 

ఈవీఎంలను ఎలా టాంపర్ చేయోచ్చు తెలిపేందుకు ఆప్ ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలే ఏర్పాటు చేసింది.

 

ఆ పార్టీ ఎమ్మెల్యే సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ గా పనిచేశారు. ప్రజాప్రతినిధికాకముందు ఆయనకు ఇంజనీర్ గా పదేళ్ల అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే ఆయన ఈవీఎంలను ఎలా టాంపరింగ్ చేయోచ్చు డెమో ఇచ్చారు.

 

ఓ సీక్రెట్ కోడ్తో  ఈవీఎంల‌ను ఎలా బోల్తా కొట్టించ‌వచ్చో చూపించారు.

 

డెమోలో భాగంగా ఆయన మొద‌ట మెషీన్లో ఐదు పార్టీల‌కు రెండేసి ఓట్లు వేయ‌గా.. అవ‌న్నీ స‌రిగ్గానే వ‌చ్చాయి. ఆ త‌ర్వాత ఆయ‌న ఓ సీక్రెట్ కోడ్ ఎంట‌ర్ చేశారు. దాంతో వేసిన ఓట్ల‌న్నీ ఒకే అభ్య‌ర్థికి వెళ్లాయి. గత ఎన్నికలలో బీజేపీ ఇలా టాంపరింగ్ చేసే విజయాలను దక్కించుకుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

 

ఇదంతా బాగానే ఉన్నా... ఎన్నికల సంఘం మాత్రం ఈ డెమో నిజం కాదని స్పష్టం చేసింది. తమ ఈవీఎంలను టాంపరింగ్ చేసే అవకాశమే లేదని పేర్కొంది.

click me!