గుజరాత్ లో సమ్మె శంఖం పూరించిన ప్రధాని మోదీ తమ్ముడు

First Published May 9, 2017, 12:19 PM IST
Highlights

గుజరాత్ లో సమ్మె చేసి ఎవరికీ నిత్యావసర సరకులు అందకుండా చేస్తామని  హెచ్చరిస్తున్నాడు  ప్రధాని మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ.  ప్రహ్లాద్ మోదీకి అంతగా కోపం రావడానికి కారణం, ఆయన నాయకత్వం వహిస్తున్న  అసోసియేషన్   డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకుండా తాత్సారం చేస్తూ ఉండటమే.అందుకే   బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె శంఖం పూరించారు.

గుజరాత్ లో సమ్మె చేసి ఎవరికీ నిత్యావసర సరకులు అందకుండా చేస్తామని చెబుతున్నాడు  ప్రధాని మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ.

 

 ప్రహ్లాద్ మోదీకి అంతగా కోపం రావడానికి కారణం, ఆయన నాయకత్వం వహిస్తున్న  అసోసియేషన్   డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకుండా తాత్సారం చేస్తూ ఉండటమే.అందుకే  ఆయన  బిజెపి  ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెచేసేందుకు సిద్ధమయ్యారు.

 

ఆయన గుజరాత్ లో చిన్న పాటి ట్రేడ్ యూనియన్ లీడర్. రాష్ట్ర చౌకడిపో డీలర్ల , కిరొసిన్ లైసెన్స్ దారుల సంఘానికి అధ్యక్షుడు. ఈ మేరకు ఒక అల్టిమేటమ్ కూడా జారీ చేశారు.   ఆయన చౌకదుకాణాల డీలర్లసంఘానికినాయకత్వం వహిస్తున్నారు.  డీలర్ల కమిషన్ పెంచుతూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొనకపోతే, మే 28 నుంచి సమ్మె శంఖం పూరిస్తామని  ప్రహ్లాద్ మోదీ హెచ్చరించారు.

 

‘ అహింసామార్గంలో మా నిరసన తెలియచేసేందుకు మొదట మూకుమ్మడిగా రాజీనామా చేయాలనుకుంటున్నాం,’ అని ప్రహ్లాద్ మోడీ చెప్పారు.

 

గుజరాత్ రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ కార్యదర్శి కి ఒక లేఖరాస్తూ సమ్మె విషయం తెలియచేశారు ప్రహ్లాద్ మోడీ.గుజరాత్ ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోతే, నిరవధిక చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు.  గుజరాత్ లో దాదాపు 1.2 కోట్ల రేషన్ కార్డు దారులున్నారు.

 

ఇరవై రోజుల ముందగానే సమ్మె నోటీసు ఇచ్చామని, అప్పటికి ప్రభుత్వనిర్ణయం రాకపోతే,  రాష్ట్ర వ్యాపితంగా నిత్యావసర సరుకును, కిరొసిన్ ను పంపిణీ చేయడం మానేస్తామని ప్రహ్లాద్ మోడీ చెప్పారు.

 

click me!