
రాహుల్ సభకు వెళ్లిన వాళ్లు దేశద్రోహులయితే, పవనేమిటి?
పవన్ కల్యాణ్ రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా భరోసా సభకు మద్దతు ప్రకటించారు. అంతేకాదు, ఈ సభను ఏర్పాటుచేసిన ఆంధ్రా పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి ని అభినందించారు. టేం లేదుకాదని, నేనూ సభకు వచ్చి వుండేవాడిని అన్నాడు.
ఈ ట్విట్టర్ ప్రకటనతో టిడిపికి, పవన్ కల్యాణ్ కు పూర్తిగా చెడిందనుకుంటున్నారు. ఎందుకంటే, చంద్రబాబు గుంటూరు రాహుల్ గాంధీసభకు మరీ ఎక్కువగా స్పందించారు. సభకు వెళ్లేవాళ్లని ఏంచేసినా పాపంలేదన్నారు. వారి పట్ల సానుభూతి చూపాల్సిన పని లేదని అన్నారు. హింస తప్ప ఏమయినా చేయండన్నారు. అంతేకాదు, చివరకు, ఈసభకు వెళ్లే దేశ ద్రోహులని కూడా అన్నారు.
ఈ లెక్కన, పవన్ కల్యాణ్ కూడ దేశద్రోహుల కోవలోకే రావాలా?
సరిగ్గా మూడు రోజుల కిందట, తెలుగుదేశం నాయకులకు పిలుపునిస్తూ పవన్ మనోడే, పవన్ వ్యక్తిత్వాన్ని శంకించలేదని అన్నారు.
ఇపుడు పవన్ పట్ల ఎలాంటి ధోరణి తీసుకుంటారు.
పవన్ పట్ల సానుభూతి చూపరా?
చంద్రబాబు సర్టిఫికెట్ ను పవన్ ఖాతరు చేసినట్లు లేరు. చంద్రబాబు పొద్దన్ లేచినప్పటినుంచి పొద్దుగూకే దాకా తిడుతున్న కాంగ్రెస్ సభకు పవన్ మద్దతునిచ్చారు.
రాహు ల్ గాంధీ హాజరయిన ప్రత్యేక హోదా భరోసా సభకు పవన్ మద్దతు తెలిపిన వార్తని పవన్ అభిమానులు బాగా స్వాగతించారు. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని కూడా సోషల్ మీడియా పోస్టులు పెట్టారు.
దీనిని బట్టి, పవన్ ఇక తెలుగుదేశంతో దోస్తీ మానేనిసినట్లే నని , ఆయన ప్రభుత్వవ్యతిరేకంగా ధోరణి ఉధృతం చేస్తారని జనసేన అభిమానులు భావిస్తున్నారు.