బ్యాంకాక్ లో ‘తెలుగు’ విశేషం

First Published Sep 3, 2017, 9:51 AM IST
Highlights
  • 70 సం. భారత-ధాయలాండ్ సంత్సంబంధాలకు గుర్తుగా ధాయ్ రాజధాని బ్యాంకాక్ లో ‘ఫెస్టివల్ ఆప్ ఇండియా’ జరిగింది.
  • అక్కడ తెలుగువారి వారసులు ‘శ్రీ కృష్ణ’ నృత్య రూపకం ప్రదర్శించారు.

అనుకోకుండా  బ్యాంకాక్ లో ఒక తెలుగు విచిత్రం బయటపడింది. ధాయ్ లాండ్ రాజధాని లో జరుగుతున్న భారతీయ సాంస్కతిక ప్రదర్శనకు వచ్చిన తమిళనాడు కళాకారులు.... ఎపుడో తెలుగువారు. వారు చెప్పిన దాని ప్రకారం చాలా చాలా కాలం కిందట  వారి పూర్వికులు తమిళనాడు వెళ్లారు. ఈ సంగతి ఇలా బయటపడింది.

డెబ్బయి సంవత్సరాల భారత స్వాతంత్ర్యోత్సవాలను పురస్కరించుకుని థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్  ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన శ్రీ భరతకళా అకాడెమీ ‘శ్రీకృష్ణ’ ప్రదర్శించింది. నర్తకి పేరు సుమన. సుమన తల్లి శ్రీరంగం పూర్ణ పుష్కల భరతకళా అకాడెమీ నిర్వహిస్తున్నారు. భారత్-ధాయ్ లాండ్ 70 సంవత్సరాల సత్సంబంధాలకు గుర్తుగా ఈ వేడుకను భారత ప్రభుత్వం, ధాయ్ లాండ్ లోని ఫ్రెండ్స్ ఆఫ్ అర్ట్ మరికొన్ని సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.  చిత్రమేమిటంటే, తమిళనాడుకు చెందిన పూర్ణ పుష్కల పూర్వీకులు తెలుగు వారు. ఇప్పటి అమరావతి సమీపంలో ఉండేవారు. చాలా సంవత్సరాలకిందట వారు తమిళనాడు లోని తంజావూరు చిదంబర్ వలస వెళ్లారు. వారింకా తెలుగును కాపాడుకున్నారు.ఆమె తెలుగులో మాట్లాడగలుగుతారు.  ఈ విషయాలను ఆమె తనకు తారసపడిన మరొక తెలుగు డాక్టర్ నరసింహులు చెప్పారు. ప్రదర్శనకు పలువురు భారతీయుల, ధాయ్ లాండ్ కళాకారులు, అధికారులు హాజర్యారు. అక్కడ హిందీ బోధిస్తున్న తెలుగు వాడు డాక్టర్ నరసింహులు కూడా ఈకార్యక్రమానికి హాజరయ్యారు. కళల మీద ఉన్న అభిమానంతో ఆయన పుష్కలతో మాట మాట కలిపారు. ఈ విషయాలు వెల్లడయ్యాయి. శనివారం సాయంకాలపు నృత్యప్రదర్శన సయామ్ సిటిలో సాలచాలెర్మక్రుంగ్ రాయల్ ధియెటర్ లో జరిగింది. ఆదివారం నాడు   కళల మీద ఒక వర్కషాపు కూడా నిర్వహిస్తున్నారు.

click me!