నంద్యాల దెబ్బకు హడలిపోయిన రాయలసీమ పాళెగార్

First Published Sep 2, 2017, 4:50 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీకి నంద్యాల ఉప ఎన్నికలలో వచ్చిన మెజారిటీని, రాయలసీమ వాదంతో ఎన్నికల్లో దిగిన వారికి పడిన ఓట్లను చూశాక, చాలా మంది రాయలసీమ నేతలలో పరివర్తన వస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

నంద్యాల ఉప ఎన్నిక  వైసిపి నేత జగన్ కంటే, కాంగ్రెస్ కంటే కూడా పెద్దదెబ్బ తీసింది రాయలసీమ వాదాన్ని. ఇంతకాలం రాయలసీమ మూసిన పిడికిలి లా ఉండేది. రాయలసీమ ప్రజల్లో తమని ముఖ్యమంత్రి చంద్రబాబునిర్లక్ష్యం చేస్తున్నాడనే భావం బలంగా ఉందని, రాయలసీమకు రావలసిన  రాజధానిని తీసుకుపోయిన కోస్తా స్థాపించడంతో ప్రజల్లో ఆగ్రహం ఉందని, చంద్రబాబు అజండాలో రాయలసీమ లేదని... ఇల రకాలరకాల వాదనలు వినబడుతూ వచ్చాయి. ఇది నిజమో, అపోహనో పరీక్షించే అవకాశం లేకుండా పోయింది. రాయలసీమ నడిబొడ్డున ఉన్న నంద్యాల ఈ అవకాశాన్నిచ్చింది. అక్కడి ప్రజలలోరాయలసీమ భావన ఎలా ఉందని నాడిపట్టే  వీలు కల్పించింది. తీరాచూస్తే, రాయలసీమకువ్యతిరేకి అనుకునే తెలుగుదేశానికే కనివిని ఎరుగుని మెజారిటీ ఇచ్చారు. దీనితో రాయలసీమనాయకుల్లో అలసట మొదలయింది.

నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇక రాయలసీమ, రాయలసీమ అంటూ  ఉద్యమాలు చేయ లేం లే అనుకుంటున్నట్లున్నారు. తెలుగుదేశం పార్టీకి నంద్యాల ఉప ఎన్నికలలో వచ్చిన మెజారిటీని, రాయలసీమ వాదంతో ఎన్నికల్లో దిగిన వారికి పడిన ఓట్లను చూశాక, చాలా మంది రాయలసీమ నేతలలో పరివర్తన వస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో భాగంగా ఆర్ పి ఎస్ నాయకుడు, మాజీ తెలుగుదేశం ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆర్ పిఎస్ ను మూసేస్తాడంటున్నారు. అవకాశం చూసుకుని ఆయన తెలుగుదేశం చేరవచ్చనే ప్రచారం మొదలయింది. నంద్యాల ఫలితాల నేపథ్యంలో ఆయన అనుచరులతో సమావేశమవుతారని చెబుతున్నారు. అంటే ఏదో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని అర్థం. రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ సందడి బాగా చేసిన వారిలో బైరెడ్డి ఒకరు.నందికొట్కూర్ ఏరియాలో రాజకీయ పాళెగార్.

ఖూనీ కేసులున్నాయి. జైలుకూడా పోయివచ్చాడు. ఈ కేసులు ఆయన రాజకీయాలకు అడ్డొచ్చాయి. అందువల్ల కూతరు శబరిని ఎన్నికల బాటలోకి తెచ్చారు. చంద్రబాబు కు వ్యతిరేకంగా రాయలసీమ సెంటిమెంటు రాజేసేందుకు బాగా ప్రయ్నతించారు.  పాదయాత్రలనో, బస్సు యాత్రలనో కలెక్టర్ కార్యాలయానికి మార్చ అనో, ఒర్వకల్ ఇండస్ట్రియల్ బెల్ట్ లో భూములు కోల్పోయే రైతుల సమీకరణ అనో ...  ఎపుడూ ఆయన ముందున్నాడు. వాళ్లనాయన లాగా మాంఛి వాగ్ధాటి ఉన్ననాయకుడు. స్వతహాగా నాయకుడు. ఇపుడు రాయలసీమ అంటున్న నాయకులలో వెయిటున్న నాయకుడాయనే.  అందుకే రాయలసీమ పరిరక్షణ సమితి అనే పార్టీని ఏర్పాటుచేశారు. జనాన్ని సమీకరించే ప్రయత్నం చేశారు. రాయలసీమ హైవే ఎక్కారు. కాని,ఎం లాభం, జనం నంద్యాల రూట్ లోఉన్నారు. అందుకే ఆయన రాయలసీమ వాదన నంద్యాలలో ఎవ్వరికీ వినిపించనే లేదు. ఎన్నికలపుడు అక్కడే ఉండి ఆర్పీఎస్ అభ్యర్థికి ప్రచారం చేశారు. చివరకు ఏమయింది, డిపాజిట్ కూడా దక్కలేదు. కాబట్టి, ఇంకా  పోరాటం సాగించడం సాధ్యమా అని ఆయన యోచిస్తున్నారని తెలిసోనోళ్లు చెబుతున్నారు. అందుకే రెండు మూడు రోజులలో ఒక మీటింగేసుకుని అమరావతివైపేళ్లాలా లేక, రాయలసీమ అంటూ అక్కడక్కడే తిరుగుతూ ఉండాలా అనేది తేల్చుకోబోతున్నారని చెబుతున్నారు.

 

 

మరిన్ని తాజా వార్త కోసం కింది ఫోటో మీద క్లిక్ చేయండి

click me!