దేవాన్ష్ ఏడ్చినా జగన్ గిచ్చినట్లేనా?

First Published Jun 9, 2017, 3:15 PM IST
Highlights

‘‘రాష్ట్రంలో ఏసంఘటన జరిగినా దాని వెనుక జగన్‌ ఉన్నట్లేనా? రేపు ఎప్పుడైనా చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ ఏడ్చినా జగనే గిచ్చి ఉంటాడని చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు,’’ అని ఆమె అన్నారు. అసెంబ్లీ భవనం లీకేజీలో కుట్ర ఉందనుకుంటే, పెద్ద ఎత్తున దర్యాప్తు జరగాలని,దానికి  సీబీఐ విచారణకు సిద్ధపడాలని ఆమె సలహా ఇచ్చారు

ఇపుడు రాష్ట్రంలో ఏ అవాంఛనీయ సంఘటనజరిగినా దాని వెనక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని తెలుగుదేశం నేతలు ఆరోపించడానికి వైసిపిఎమ్మెల్యే ఆర్ కె రోజా అభ్యంతరం చెప్పారు.అసెంబ్లీ సాక్షిగా ఇది ఒక కుట్ర అని రోజా వ్యాఖ్యానించారు. తిరుపతిలో ఆమె ఈరోజు విలేకరులతో మాట్లాడారు.

 

కొత్త అసెంబ్లీ భవనంలో షార్ట్ సర్క్యూట్ వచ్చేలా చేసి జగన్ ని ఏమైనా చేయాలనుకుంటున్నారేమో నని కూడా ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

 

‘‘రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దాని వెనుక జగన్‌ ఉన్నట్లేనా. రేపు ఎప్పుడైనా చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ ఏడ్చినా... జగనే గిచ్చి ఉంటాడని చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు,’’ అని ఆమె అన్నారు.

అసెంబ్లీ భవనం లీకేజీలో కుట్ర ఉందనుకుంటే, పెద్ద ఎత్తున దర్యాప్తు జరగాలని,దానికి  సీబీఐ విచారణకు సిద్ధపడాలని ఆమె సలహా ఇచ్చారు.

 

’అసెంబ్లీ కట్టిన తీరు చూస్తే మొత్తం దోచుకోవడమే అన్నట్లుంది. అక్కడ ఎమ్మెల్యేలకు టాయ్ లెట్లు కూడా లేవు. టెంపరరీ బిల్డిండ్ కాబట్టి ఎంత తిన్నా ఏమిజరగనేది ధీమా వారిది,’’అని ఆమె అన్నారు.

 

’సిఐడి ఎంక్వయిరీ అంటున్నారు, మీ చేతిలో ఉండే సిఐడి ఏమి ఎంక్వయిరీ చేస్తుంది. సిబిఐ తో విచారణ డిమాండ్ చేస్తున్నాం మేం‘ అని ఆమె అన్నారు.

 

వందల కోట్ల ఖర్చుతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రాష్ట్ర నూతన శాసనసభ, సచివాలయం  మంగళవారం నాడు  కేవలం 20 నిమిషాలపాటు కురిసిన సాధారణ వర్షానికే జలమయం అయిన సంగతి తెలిసిందే. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి అసెంబ్లీలో కేటాయించిన చాంబర్‌లో లీకేజీల వల్ల వాననీరు ఏరులై పారింది. చాంబర్‌లో సీలింగ్‌ ఊడిపడింది. సోఫాలు పూర్తిగా తడిసిపోయాయి. ఏసీ, రూఫ్‌లైట్ల నుంచి కూడా వాన నీరు కారిపోవడంతో కింద బక్కెట్లు పెట్టాల్సి వచ్చింది.

 

ఇలా వర్షపు నీరు కారడానికి కుట్రయే కారణమని, ఎవరో పైపులు కోశారని స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నసంగతి తెలిసిందే. పైపుల కోతను ప్రజలు కూడా తిలకించవచ్చని  చెబుతూ స్పీకర్  జనసామాన్యాన్ని అనుమతించాలనుకుంటున్నారు.

 

click me!