విజయవాడలో దాసరి కాంస్య విగ్రహం

Published : Jun 09, 2017, 01:33 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
విజయవాడలో దాసరి కాంస్య విగ్రహం

సారాంశం

దర్శకరత్నదాసరి నారాయణరావు కాంస్య విగ్రహాన్ని త్వరలో నగరంలో ఏర్పాటు చేయనున్నారు. విజయవాడలోని  మహానటి సావిత్రి కళాపీఠం విగ్రహం ఏర్పాటుకు చొరవ తీసుకుంటున్నది. ఈ సంస్థ  వ్యవస్థాపక అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మి ఈ విషయం వెల్లడించారు.  గాంధీనగర్‌లోని తన కార్యాలయంలో  విలేకరులకు  ఈ సమాచారం అందించారు. 

విగ్రహం గురించి వివరాలు, ఎపుడు ఏర్పాటుచేసేది ముందు ముందు వెల్లడిస్తామని ఆమె చెప్పారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండి, ఎందరో నటీనటులు, కళాకారులకు ఎంతో చేయూత ఇచ్చిన నటున్ని నిత్యంస్మరించుకోవలసి అవసరం ఉందని ఆమె చెప్పారు. మహానుభావుడికి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఒక  నివాళిగా భావిస్తున్నట్లు,అది తమ బాధ్యత అని  ఆమె తెలిపారు.

విగ్రహావిష్కరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా సూచనలు, సలహాలు తీసుకుంటామని కూడా ఆమె చెప్పారు. సమావేశంలో కొత్తజ్యోతి, ఐలాపురం శ్రీదేవి పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !