నంద్యాలలో చంద్రబాబు భూమా కలలు నెరవేరుస్తున్నారు

Published : Jul 14, 2017, 01:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
నంద్యాలలో చంద్రబాబు భూమా  కలలు నెరవేరుస్తున్నారు

సారాంశం

నంద్యాలకు మంత్రులు వస్తున్నది ఎన్నికల కోసం కాదు మాజీ ఎమ్మెల్యే భూమ నాగిరెడ్డి కలలు నేరవేర్చేందుకే మంత్రుల రాక   నాగిరెడ్డి కలలు కన్నట్లు నంద్యాలను అభివృద్ధి చేస్తానని సిఎం చెప్పారు

నంద్యాలమీద విపరీతంగా ప్రేమ ఒలకబోస్తున్నదని ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాదని మంత్రి అమర్ నాథ్ రెడ్డి చెబుతున్నారు. ఈ రోజు ఆయన కూడా నంద్యాల కొచ్చారు. విలేకరులతో మాట్లాడుతూ తనది కూడా ఎన్నికల పర్యటన కాదు, నంద్యాల అభివృద్ధి కోసమే నని చెప్పుకొచ్చారు. 

తెలుగుదేశం పార్టీలో నంద్యాల తత్తర పాటు, ముఖ్క మంత్రి చంద్రబాబునాయుడు, ఆయన వారసుడు రాష్ట్ర ఐటి మంత్రి లోకేశ్ నాయుడు, మునిసిపల్ మంత్రినారాయణ, సమాచారశాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు... తదితరులు నియోజకవర్గంలో తిరిగేందుకు ఎన్నికలు కాదని ఆయన ఒక రహస్యం బయటపెట్టారు.

 ‘ఉప ఎన్నికల నేపథ్యంలోనే మంత్రులు నంద్యాల కు వస్తున్నారని ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. మేమంతా నంద్యాల కు వస్తున్నది నాగిరెడ్డి ఆశయం నెరవేర్చేందుకు,’ అని ఆయన చెప్పారు.

‘నంద్యాల ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనేది నాగిరెడ్డి ఆశయం.  కానీ ఆయన అకస్మాత్తుగా కీర్తి శేషులయ్యారు.- నాగిరెడ్డి మరణాంతరం ఆయన ఆశయాలకు అనుగుణంగా నంద్యాల ను అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. - అందులో భాగంగా నే ఈరోజు ఇక్కడికి వచ్చాము,’ ఆయన నంద్యాల ప్రజలకుచెప్పారు. నమ్మండని కోరారు.

నంద్యాల అభివృద్ధి చెందాలనే చిత్తశుద్ది ఉంటే ఎన్నికల పోటీ వైకాపా నుంచి తప్పుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !