తమిళ భవిష్యత్తు కరీంనగరోళ్ల చేతుల్లో...

First Published Feb 11, 2017, 6:15 PM IST
Highlights
  • రాజ్యాంగబద్దంగా ఒకరు... రాజకీయ చతురతతో మరొకరు
  • తంబీల సీఎంను నిర్ణయించేది మనోవాళ్లే

సస్పెన్స్ థ్రిల్లర్ లా క్షణ క్షణం ట్విస్ట్ తో సాగుతున్న తమిళ రాజకీయల భవిష్యత్తు కరీంనగరోళ్ల చేతుల్లోనే ఉంది. శశికళను పీఠం ఎక్కించాలన్నా... పన్నీరుకే మళ్లీ పట్టం కట్టాలన్నే అంతా ఇక్కడి వారు దయ తలిస్తేనే జరుగుతుంది...
 

అవును మీరు చదువుతుంది నిజమే.. దేశమంతా ఉత్కంఠంగా చూస్తున్న తమిళనాడు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేది కచ్చితంగా మన కరీంనగర్ వాళ్లే.

 

కరీంగనగర్ కు చెందిన ఆ ఇద్దరు వ్యక్తులు తీసుకునే నిర్ణయంతోనే తమిళ సీఎం ఎవరనేది తేలుతుంది.

ఇంతకీ ఎవరూ ఆ ఇద్దరు వ్యక్తులు తెలుసా...

 

ఒకరు తమిళనాడు ఇన్ చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు కాగా, మరొకరు బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ ఇన్ చార్జ్ మురళీధర్ రావు. ఈ ఇద్దరి పాత్రే ఇప్పుడు తమిళనాట కీలకంగా మారనుంది. ఈ ఇద్దరు కరీంనగర్ జిల్లా వాసులే.

 

ఎఐడీఎంకే లో సంక్షోభం నెలకొనడం పార్టీ రెండు వర్గాలుగా చీరిన నేపథ్యంలో అక్కడ గవర్నర్ పాత్రే  కీలకంగా మారింది. తన విచక్షణాధికారంతో పన్నీరు, శశికళలలో ఎవరిని సీఎం చేయాలని నిర్ణయించే అధికారం గవర్నర్ విద్యాసాగర్ రావు కు ఉంది.

 

అదే విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గట్టిగా ఉచ్చుబిగిస్తే తమిళరాజకీయాల్లో అనుకోని పరిణామాలు సంభవిస్తాయి. పార్టీని చీల్చి ఒక వర్గానికి మద్దతివ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యూహరచనను అమలు చేయాల్సింది రాష్ట్రానికి పార్టీ ఇన్ చార్జ్ గా ఉన్న మురళీధర్ రావుపై నే ఉంటుంది.  అంటే తదుపరి సీఎం ఎవరూ అనేది ఆయనే నిర్ణయించే అవకాశం ఉంటుంది.

 

అన్నా డీఎంకేలో సంక్షోభం మూలంగా తంబీల సీఎంను కరీంగనగరోళ్లు నిర్ణయించే అవకాశం వచ్చిందన్నమాట.

click me!