రాజ్యసభలో సింహం...

Published : Jul 17, 2017, 02:18 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
రాజ్యసభలో సింహం...

సారాంశం

పార్లమెంటులో  వెంకయ్యనాయుడికి అభినందనల వెల్లువ రాజ్యసభ ఛెయిర్మన్ ఒక సింహంరాబోతున్నదన్న సుబ్రమణ్యస్వామి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభినందనలు రాజ్యసభ చాలా హుందా సాగుతుందన్న కేంద్ర ముక్తార్ అబ్బాస్ నక్వీ

రాజ్యసభలో సింహాన్ని చూడబోతున్నామని  కేంద్ర మంత్రి వెంకయ్యానాయుడిని ఉద్దేశించి బిజెపి సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. 

ఇలా వ్యాఖ్యానించి ఆయన పరోక్షంగా వచ్చే ఉప రాష్ట్రపతి  వెంకయ్యనాయు డే అని ధృవీకరించారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు  మొదలయిన పార్లమెంట్ సమావేశాలకు హాజరైన  సభ్యులంతా వెంకయ్యనాయుడుకు అభినందనలు చెప్పారు.

అభినందనలు చెప్పిన వారిలో  ఎవరున్నారో తెలుసా,  మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేత ఆజాద్, జేడీయూ నేత శరద్ పవర్, వామపక్ష నేత రాజా .

కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మరింత ముందుకు వెళ్లి  వెంకయ్య  రాజ్యసభను హుందాగా నడిపిస్తారని  ప్రకటించారు.  అపుడే  సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆయనను అభినందిస్తూ రాజ్యసభలో సింహాన్ని చూడబోతున్నామని అన్నారు. 
 
ఇదంతా ఏమి చెబుతుంది, ఉప రాష్ట్రపతిగా వెంకయ్యపేరు దాదాపు ఖరారయిందనేగా.

ఈ అభినందనల వెల్లువకు వెంకయ్యనాయుడు తనదైన శైలిలో స్పందించారు.

‘ పెళ్లే కాలేదు,  పిల్లగాడికి పేరు పెడితే ఎలా?’ అని తన సహజశైలిలో చమత్కరించారు.

 క్రియాశీల రాజకీయాల్లోనే ఉండాలని అనుకుంటున్నారని, ఉపరాష్ట్రపతి పదవిపై తనకు మోజు లేదని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !