
బెంగుళూరు సెంట్రల్ జైల్లో శశికళ స్పెషల్ కిచెన్ బయటపెట్టిన కర్నాటక జైళ్ల డిఐజి డి రూపమీద వేటుపడింది. ఎఐఎడిఎంకె నాయకురాలు శశికళ నుంచి రెండు కోట్ల లంచం తిని స్పెషల్ కిచెన్ ఏర్పాటుచేయించారని రూప ఒక నివేదిక తయారు చేశారు. అంతేకాదు, జైళ్ల శాఖ డిజిపి సత్యనారాయణ కూడా ఒక లబ్దిదారు అని అమె పేర్కొన్నారు.
ఇదెక్కడ తగిలిందో ఏమో ప్రభుత్వ ఆమె జైళ్ల శాఖ నుంచి బదిలీ చేసింది. రూప ట్రాఫిక్ విభాగానికి మార్చారు.
.