చంద్రబాబుని వదలని తెలంగాణా షాక్

First Published May 28, 2017, 2:49 PM IST
Highlights

టిడిపి  పాలిట్ బ్యూరో సభ్యుడు రమేశ్ రాథోద్ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని  ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో తెలంగాణా రాష్ట్ర సమితిలో చేరారు. కెసిఆర్ గులాబీ కండువా కప్పి రాధోథ్ ను పార్టీలో చేర్చకున్నారు. మనగడ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న తెలంగాణాటిడిపికిది పెద్ద దెబ్బ.

విశాఖ లోబీచొడ్డున మహానాడు లో తెలుగుదేశం అధ్యక్షుడుచంద్రబాబునాయుడు పొగడ్తలలో మునిగితేలుతూ ఉంటే, ఇటువైపు తెలంగాణాలోపార్టీ మాజీ ఎంపి,టిడిపి పాలిట్ బ్యూరో సభ్యుడు రమేశ్ రాథోడ్ పార్టీ నుంచి ఉడాయించేశాడు.

ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని  ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో తెలంగాణా రాష్ట్ర సమితిలో చేరారు.

 కెసిఆర్ గులాబీ కండువా కప్పి రాధోథ్ ను పార్టీలో చేర్చకున్నారు.

తెలంగాణా నుంచి సీనియర్లంతా నిష్క్ర మిస్తున్న సంగతి తెలిసిందే

తెలంగాణానుంచి తెలుగుదేశాన్ని పూర్తి గా తరిమేయడంలో భాగంగా కెసిఆర్ సీనియర్లందరిని పార్టీలో చేర్చకుంటున్నారు.

ఈ సందర్భంగా రమేశ్‌ రాథోడ్‌ మీడియాతో మాట్లాడుతూ తన చేరిక గురించి ఇలా అన్నారు.

"ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానించడం వల్లే టీఆర్‌ఎస్‌లో చేరాను. అదే సమయంలో ప్రభుత్వం అమలుచేస్తోన్న పథకాలు కూడా నచ్చాయి. నాతో పాటు టీడీపీ క్యాడర్‌ మొత్తం పార్టీ నుంచి బయటికి వచ్చేసింది."

రాధోడ్ ను తీసుకురావడంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పాత్ర బాగా వుందని చెబుతున్నారు.

‘నాగేశ్వర్‌రావు నాకు ఆప్త మిత్రుడు’అని రాధోడ్ కూడా చెప్పారు.

వచ్చే ఎన్నికలలో  రాథోడ్ ఎంపి సీటు లేదా ఎమ్మెల్యే సీటు గ్యారంటి అని కెసిఆర్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

.

 

 

 

click me!