
అమెరికాలోని టెక్సాస్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ వరదల ధాటికి మరో భారతీయ విద్యార్థిని మృతి చెందింది. గత కొద్ది రోజులుగా టెక్సాస్ నగరంలో భారీ వర్షాలకు వరదలు పొంగి పొర్లిన సంగతి తెలిసిందే. భారత్ కి చెందిన షాలిని సింగ్ (25) అక్కడి విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు. కాగా.. ఆ వరదల్లో.. ఆమె చిక్కుకుపోయారు.
మరో భారత విద్యార్థి నిఖిల్ బాటియాతో పాటు.. సహాయక సిబ్బంది షాలినీ సింగ్ ని కూడా రక్షించారు. కాగా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నిఖిల్ వెంటనే మృతి చెందగా.. షాలినీ ప్రాణాలతో పోరాడి నిన్న రాత్రి మృతి చెందింది.
ఢిల్లీ కి చెందిన షాలినీ సింగ్ మాస్టర్ డిగ్రీ చేసేందుకు గత నెలే అమెరికాకు వెళ్లారు. కాగా ప్రమాదవశాత్తు వరదల్లో చిక్కుకొని మృత్యువాతపడ్డారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి