
చైనాలోని షియామెన్ లో బ్రిక్స్ 2017 సమావేశాలు జరుగుతున్నాయి. భారత ప్రదాని మోదీ, చైనా దేశాధినేత జిన్ పింగ్ ఇలా ఎందరో పెద్ద వాళ్లంతా అక్కడ సమావేశమవుతూ ఉండటంతో చాలా సందడిగా ఉంది. అయితే, ఒక చైనా జర్నలిస్టు అందరికంట పడింది. కారణం ఆమె హిందీ పాటలను చక్కగా పాడుతుంది.ఆమె పేరు తాంగ్ యుంగాయ్. చైనా రేడియో ఇంటర్నేషనలోని హిందీ సర్వీస్ శాఖలో ఆమె రిపోర్టర్ గాపని చేస్తున్నది. ఆమె అక్కడి ఎఎన్ ఐ ప్రతినిధితో కొద్ది సేపు ముచ్చటించి చాలా ఆసక్తికరమయిన విషయాలు చెప్పింది. ఆమెకు హిందీ బాగా వస్తుంది. ఇండియాలోనే హిందీ చదివింది. హిందీ సినిమాలంటే పడిచస్తానని చెప్పింది. చైనా ప్రజలు ‘దంగల్’ సినిమాని తెగ చూశారని, ఆ చిత్రం వాళ్లకి బాగా నచ్చిందని కూడా చెప్పింది. అయితే, ఆ సినిమా ఆమీర్ ఖాన్ అంత హ్యాండ్సమ్ గా కనపించలేదని అభిప్రాయపడింది. ఈ మధ్యలో నూరీ సినిమాలోని మోస్ట్ పాపులర్ సాంగ్ ‘ఆ జా రే’ పాడి వినిపించింది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి